Breaking News

SA VS PAK 1st ODI: రాణించిన క్లాసెన్‌

Published on Tue, 12/17/2024 - 21:22

పార్ల్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి వన్డేలో సౌతాఫ్రికా స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ (97 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 86 పరుగులు) రాణించడంతో సౌతాఫ్రికా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 

సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోనీ డి జోర్జి (33), ర్యాన్‌ రికెల్టన్‌ (36), ఎయిడెన్‌ మార్క్రమ్‌ (35), మార్కో జన్సెన్‌ (10), కగిసో రబాడ (11), ఓట్నీల్‌ బార్ట్‌మన్‌ (10 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేశారు. రస్సీ వాన్‌ డెర్‌ డస్సెన్‌ (8), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (1), అండైల్‌ ఫెహ్లుక్వాయో (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.

ఓపెనర్లు జోర్జి, రికెల్టన్‌ తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించడంతో సౌతాఫ్రికా ఓ దశలో భారీ స్కోర్‌ చేసేలా కనిపించింది. అయితే ఇక్కడే పాక్‌ స్పిన్నర్‌ సల్మాన్‌ అఘా సఫారీ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అఘా 18 పరుగుల వ్యవధిలో జోర్జి, రికెల్టన్‌, డస్సెన్‌, స్టబ్స్‌ వికెట్లు పడగొట్టాడు. 

ఈ దశలో మార్క్రమ్‌.. కొద్దిసేపు క్లాసెన్‌తో కలిసి క్రీజ్‌లో నిలదొక్కుకున్నాడు. మార్క్రమ్‌ ఔటయ్యాక జన్సెన్‌ సాయంతో క్లాసెన్‌ సెంచరీ దిశగా సాగాడు. అయితే సఫారీలను ఈ సారి షాహీన్‌ అఫ్రిది ఇబ్బందుల్లోకి నెట్టాడు. సెంచరీకి చేరువలో ఉండగా అఫ్రిది క్లాసెన్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు.

ఆఖర్లో టెయిలెండర్లు ఒక్కో పరుగు పోగు చేయడంతో సౌతాఫ్రికా 239 పరుగులు చేయగలిగింది. పాక్‌ బౌలర్లలో సల్మాన్‌ అఘా 4, అబ్రార్‌ అహ్మద్‌ 2, షాహీన్‌ అఫ్రిది, సైమ్‌ అయూబ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)