Breaking News

కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనత.. అక్కడ ఎవరికీ సాధ్యం కాలేదు!

Published on Wed, 12/27/2023 - 16:02

South Africa vs India, 1st Test- Centurion: సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ సెంచరీతో మెరిశాడు. సహచరులంతా ప్రొటిస్‌ పేస్‌ దళానికి బెంబేలెత్తిన వేళ జట్టును ఆదుకునేందుకు తానున్నానంటూ ముందుకు వచ్చి సత్తా చాటాడు. తొలి రోజు ఆట సందర్భంగా అర్ధ శతకం పూర్తి చేసి ఆలౌట్‌ గండం నుంచి తప్పించిన ఈ కర్ణాటక బ్యాటర్‌.. సెంచూరియన్‌ వేదికగా బుధవారం శతకం సాధించాడు.

అప్పుడు 123...
భారత ఇన్నింగ్స్‌లో 65.6వ ఓవర్‌ వద్ద గెరాల్డ్‌ కొయెట్జీ బౌలింగ్‌లో సిక్సర్‌తో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. ఈ సందర్భంగా కేఎల్‌ రాహుల్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సెంచూరియన్‌లో అత్యధిక సెంచరీలు చేసిన పర్యాటక జట్టు బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.

టీమిండియా 2021/22 టూర్‌ సందర్భంగా సెంచూరియన్‌లో 123(260 బంతుల్లో) పరుగులు సాధించిన రాహుల్‌.. తాజాగా 101(133 బంతులు) చేశాడు.  ఇక రాహుల్‌ అద్భుత సెంచరీ కారణంగా భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులు చేయగలిగింది.

సౌతాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగా కేఎల్‌ రాహుల్‌ సాధించిన ఘనతలు
1. సెంచూరియన్‌లో అత్యధిక శతకాలు బాదిన పర్యాటక జట్టు ఏకైక బ్యాటర్‌
2. సౌతాఫ్రికా గడ్డ మీద అత్యధిక సెంచరీలు చేసిన ఆసియా బ్యాటర్ల జాబితాలో చోటు(సచిన్‌ టెండుల్కర్‌ 5, అజర్‌ మహ్మూద్‌, టి సమరవీర, విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌-2)

ఇక టెస్టుల్లో రాహుల్‌కు ఇది ఎనిమిదో సెంచరీ. విదేశీ గడ్డపై అత్యుత్తమ శతకం అని చెప్పొచ్చు. ఇక సెంచూరియన్‌ మ్యాచ్‌లో రాహుల్‌ నాండ్రీ బర్గర్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయి పెవిలియన్‌ చేరాడు. అతడి ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి.

చదవండి: న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌ సంచలన విజయం.. కివీస్‌ గడ్డపై తొలి గెలుపు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)