Breaking News

IND VS SA 1st ODI: చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్‌ సింగ్‌

Published on Sun, 12/17/2023 - 19:10

టీమిండియా పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. జొహనెస్‌బర్గ్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల ఘనతతో (10-0-37-5) విజృంభించిన ఈ పంజాబీ యువ పేసర్.. వన్డేల్లో దక్షిణాఫ్రికాపై ఆ దేశంలో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి భారత పేసర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అర్ష్‌దీప్‌కు ముందు సౌతాఫ్రికాపై పలువురు భారత బౌలర్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసినా వాళ్లంతా స్పిన్నర్లే కావడం గమనార్హం.

1999లో సునీల్‌ జోషి (5/6), 2018లో చహల్‌ (5/22), 2023లో రవీంద్ర జడేజా (5/33) సౌతాఫ్రికాపై ఐదు వికెట్ల ఘనత సాధించారు. వీరిలోనూ చహల్‌ ఒక్కడే సౌతాఫ్రికాపై ఆ దేశంలో ఐదు వికెట్ల ఘనత సాధించాడు. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. అర్ష్‌దీప్‌తో పాటు మరో పేసర్‌ ఆవేశ్‌ ఖాన్‌ (8-3-27-4) కూడా విజృంభించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా 116 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో భారత పేస్‌ విభాగం గతంలో ఎన్నడూ లేని విధంగా 9 వికెట్లు పడగొట్టింది. 1993 మొహాలీలో, 2013 సెంచూరియన్‌లో జరిగిన వన్డేల్లో టీమిండియా పేసర్లు 8 వికెట్లు పడగొట్టగా.. తాజాగా అర్ష్‌దీప్‌, ఆవేశ్‌ ఖాన్‌ ఆ రికార్డులను అధిగమించి, నయా రికార్డు నెలకొల్పారు. 

ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించిన భారత్‌..
117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌.. ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. రుతురాజ్‌ (5) తక్కువ స్కోర్‌కే ఔటైనా.. అరంగేట్రం ఆటగాడు సాయి సుదర్శన్‌ (55 నాటౌట్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (52) భారత్‌ను గెలిపించారు. టీమిండియా కేవలం 16.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)