Breaking News

లంకేయులను వారి స్వదేశంలో ముప్పుతిప్పలు పెట్టిన సౌతాఫ్రికా స్పిన్నర్‌

Published on Thu, 06/15/2023 - 13:41

మూడు వన్డేలు, రెండు టెస్ట్‌ల అనధికారిక సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా ఏ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికా 2-1 తేడాతో కైవసం చేసుకోగా.. నిన్న ముగిసిన తొలి టెస్ట్‌లో శ్రీలంక-ఏ విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఆ తర్వాత సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 131 పరుగులకే కుప్పకూలింది. అనంతరం శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 151 పరుగులకు ఆలౌట్‌ కాగా.. సౌతాఫ్రికా 185 పరుగులకే చాపచుట్టేసి, 160 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 

లంకేయులకు ముప్పుతిప్పలు పెట్టిన సెనురన్‌ ముత్తుసామి..
ఈ మ్యాచ్‌లో శ్రీలంక​ భారీ తేడాతో విజయం సాధించినప్పటికీ.. సఫారీ స్పిన్నర్‌ సెనురన్‌ ముత్తుసామి అందరి దృష్టిని ఆకర్శించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టిన ముత్తుసామి, రెండో ఇన్నింగ్స్‌లో సైతం అదే రేంజ్‌లో రెచ్చిపోయి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 12 వికెట్లు పడగొట్టిన ముత్తుసామి లంక బ్యాటర్లకు వారి స్వదేశంలో ముచ్చెమటలు పట్టించాడు.

ముత్తుసామికి సహచర బౌలర్ల నుంచి సహకారం లభించకపోవడంతో లంక బ్యాటర్లు పైచేయి సాధించారు. బౌన్సీ పిచ్‌లు అధికంగా ఉండే సౌతాఫ్రికా లాంటి దేశం నుంచి వచ్చిన స్పిన్‌ బౌలర్‌ పరాయి గడ్డపై, అందులో ఉపఖండపు పిచ్‌లపై ఈ స్థాయిలో రెచ్చిపోవడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇందుకే ముత్తుసామిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తన జట్టు ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నా​, ముత్తుసామిని అందరూ ప్రశంసిస్తున్నారు. మున్ముందు ముత్తుసామి సౌతాఫ్రికా జాతీయ జట్టులో కీలకంగా మారతాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, 29 ఏళ్ల ముత్తుసామి సౌతాఫ్రికా తరఫున ఇదివరకే అరంగేట్రం చేసి, 2 వికెట్లు పడగొట్టాడు.  

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)