Breaking News

దంచికొట్టిన సాల్ట్‌! సన్‌రైజర్స్‌కు తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం

Published on Fri, 01/13/2023 - 10:32

SA20, 2023 3rd Match- Sunrisers Eastern Cape vs Pretoria Capitals: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌కేప్‌ జట్టుకు తొలి మ్యాచ్‌లో చేదు అనుభవం ఎదురైంది. ప్రిటోరియా క్యాపిటల్స్‌ చేతిలో 23 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ప్రొటిస్‌ పొట్టి లీగ్‌లో ఢిల్లీ ఫ్రాంఛైజీ ఘనంగా ఆగమనం చాటగా.. హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ పోరాడి ఓడింది. 

సెయింట్‌ జార్జ్‌ పార్క్‌ వేదికగా.. గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఈస్టర్న్‌ కేప్‌.. తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ప్రిటోరియాకు ఓపెనర్‌ ఫిలిప్‌ సాల్ట్‌.. అదిరిపోయే ఆరంభం అందించాడు. తోటి బ్యాటర్ల నుంచి పెద్దగా సహకారం లేకపోయినా.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

భారీ స్కోరు
బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 77 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. దీంతో పార్నెల్‌ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఈస్టర్న్‌ కేప్‌ బౌలర్లలో బార్ట్‌మన్‌, మార్కరమ్‌కు రెండేసి వికెట్లు దక్కగా.. మార్కో జాన్సెన్‌ ఒకటి, మగల ఒక్కో వికెట్‌ తీశారు.

ఇక భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌ కేప్‌నకు జేజే స్మట్స్‌ శుభారంభం అందించాడు. 51 బంతుల్లో 66 పరుగులు చేశాడు. ఇతరుల్లో ట్రిస్టన్‌ స్టబ్స్‌ 23, టామ్‌ అబెల్‌ 40(నాటౌట్‌) రాణించారు. కానీ అప్పటికే జరగ్సాలిన నష్టం జరిగిపోయింది.

దీంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేయగలిగిన మార్కరమ్‌ బృందం 23 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌ బ్యాటర్‌ సాల్ట్‌ ఐపీఎల్‌-2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. మరోవైపు.. మార్కరమ్‌ సన్‌రైజర్స్‌ జట్టులో కీలక సభ్యుడన్న సంగతి తెలిసిందే.

మ్యాచ్‌ స్కోర్లు
ప్రిటోరియా క్యాపిటల్స్‌- 193/6 (20)
సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌కేప్‌- 170/5 (20)

చదవండి: Rashid Khan: రషీద్‌ ఖాన్‌ సంచలన నిర్ణయం!
IND vs SL: టీమిండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన.. సిరీస్‌ చిక్కింది

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)