Breaking News

బంగ్లాతో టీ20 సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేస్తాము: టీమిండియా కోచ్‌

Published on Sat, 10/12/2024 - 12:28

హైదరాబాద్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో మూడో టీ20లో త‌ల‌ప‌డేందుకు టీమిండియా అన్నివిధాల సిద్ద‌మైంది. శ‌నివారం సాయంత్రం 7:00 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకున్న టీమిండియా.. ఆఖరి టీ20లో గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత జట్టు అసిస్టెంట్‌ కోచ్‌ ర్యాన్‌టెన్‌ డోస్‌చేట్ విలేకరుల సమావేశంలో పాల్గోన్నాడు.

ఈ సంద‌ర్భంగా అత‌డు మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాల‌న్న‌దే మా జట్టు, అభిమానుల కోరిక‌. క‌చ్చితంగా అలాగే ముగించేందుకు ప్ర‌య‌త్నిస్తాము అని చెప్పుకొచ్చాడు. అదే విధంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మనస్తత్వం గురించి మాట్లాడాడు.

దేశం త‌ర‌పున ఆడే ప్ర‌తీ మ్యాచ్‌లోనూ విజ‌యం సాధించాల‌ని గంభీర్ భావిస్తాడు. ప్ర‌తీసారి ఆటగాళ్లని కూడా ఒత్తిడికి గురిచేస్తాడ‌న్న విష‌యం తెలిసిందే. కాబ‌ట్టి ఈ మ్యాచ్ కోసం ప్ర‌త్యేకంగా మాట్లాడాల్సిన అవ‌స‌రం లేదు. ఈ మ్యాచ్‌కు కూడా అన్ని మ్యాచ్‌ల‌కు స‌న్న‌ద్ద‌మైన‌ట్లే సిద్ద‌మ‌య్యాము. ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు అద్బుతంగా ఆడుతోంది.

 కుర్రాళ్లు కూడా బాగా రాణిస్తున్నారు. తొలిసారి భార‌త జ‌ట్టు త‌ర‌పున ఆడుతున్న  కుర్రాళ్లను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ సిరీస్‌లో ఇప్ప‌టివ‌ర‌కు జితేష్ శర్మ, తిల‌క్ వ‌ర్మ‌, హర్షిత్ రానాల‌కు ఆడే అవకాశం​ ఇంకా రాలేదు. మూడో టీ20 జట్టు ఎంపిక కు ఈ యంగ్ ప్లేయ‌ర్ల‌ను కూడా ప‌రిగణ‌లోకి తీసుకుంటున్నాము. కుర్రాళ్లందరికి అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం వచ్చేలా ప్రయత్నిస్తున్నామ‌ని ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో ర్యాన్‌టెన్‌ డోస్‌చేట్ పేర్కొన్నాడు.
చదవండి: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రాబిన్‌ ఉతప్ప
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)