Breaking News

ఆసీస్‌ టూర్‌కు భారత జట్టు ఇదే.. కెప్టెన్‌గా రుతురాజ్‌! తెలుగోడికి చోటు?

Published on Sat, 10/19/2024 - 08:06

ప్ర‌తిష్టాత్మ‌క బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీకి ముందు భార‌త్‌-ఎ జ‌ట్టు ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఈ టూర్‌లో భాగంగా ఆసీస్‌-ఎ జ‌ట్టుతో భార‌త్ రెండు అనాధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడ‌నుంది.  ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆక్టోబ‌ర్ 31 నుంచి ప్రారంభం కానుంది.

ఈ క్ర‌మంలో భార‌త జ‌ట్టును బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ ఒక‌ట్రెండు రోజుల్లో ప్ర‌క‌టించే అవ‌కాశ‌ముంది. ఇప్ప‌టికే ఆస్ట్రేలియాకు పంపే జ‌ట్టును సెల‌క్ట‌ర్లు ఖారారు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ ప‌ర్య‌ట‌న భార‌త్‌-ఎ జ‌ట్టుకు స్టార్ ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యం వ‌హించ‌నున్న‌ట్లు స‌మాచారం.

 రుతురాజ్ ఇప్ప‌టికే దేశీయ‌, అంత‌ర్జాతీయ క్రికెట్‌లో త‌ను ఏంటో నిరూపించుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మ‌హారాష్ట్ర‌కు గైక్వాడ్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే అత‌డికి భార‌త-ఎ జ‌ట్టు ప‌గ్గాలు అప్ప‌గించ‌నున్న‌ట్లు వినికిడి.

కిష‌న్‌కు చోటు?
అదేవిధంగా ఆసీస్ టూర్‌కు స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఇషాన్ కిష‌న్‌ను ఎంపిక చేయాల‌ని సెల‌క్ట‌ర్లు భావిస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. భార‌త సీనియ‌ర్ జ‌ట్టులో చోటు కోల్పోయిన కిష‌న్‌.. ప్ర‌స్తుతం రంజీల్లో జార్ఖండ్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు. 

ఈ టోర్నీలో కిష‌న్ ప‌ర్వాలేద‌న్పిస్తున్నాడు. అంత‌కముందు దులీప్ ట్రోఫీలో కూడా ఇషాన్ స‌త్తాచాటాడు. ఈ క్ర‌మంలో అత‌డిని ఆస్ట్రేలియాకు పంప‌నున్న‌ట్లు స‌మాచారం. ఇక ఆస్ట్రేలియాకు వెళ్లే జ‌ట్టులో ఆంధ్రా ఆల్‌రౌండ‌ర్ నితీష్ కుమార్ రెడ్డి, స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రికీ భుయ్ కూడా చోటు సంపాదించుకున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

ఆసీస్ టూర్‌కు భార‌త్- ఎ జ‌ట్టు(అంచ‌నా)
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్‌, దేవదత్ పడిక్కల్,సాయి సుదర్శన్, బి ఇంద్రజిత్, అభిషేక్ పోరెల్‌, ఇషాన్ కిష‌న్‌, ముఖేష్ కుమార్‌, రికీ భుయ్‌, నితీష్ కుమార్ రెడ్డి, మాన‌వ్ సుతార్, న‌వ్‌దీప్ సైనీ, ఖాలీల్ అహ్మ‌ద్‌, త‌నుష్ కోటియ‌న్‌, య‌శ్ ద‌యాళ్
చదవండి: ‘కాస్తైనా సిగ్గుండాలి నీకు!: మండిపడ్డ టీమిండియా ఫ్యాన్స్‌

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)