Breaking News

బరోడాను చిత్తు చేసిన రుతురాజ్‌ టీమ్‌​.. ఏకంగా 439 పరుగులతో

Published on Sun, 01/26/2025 - 14:09

రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా నాసిక్‌ వేదికగా బరోడాతో జరిగిన మ్యాచ్‌లో 439 పరుగుల తేడాతో మహారాష్ట్ర ఘన విజయం సాధించింది. 617 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బరోడా కేవలం 177 పరుగులకే కుప్పకూలింది. మహారాష్ట్ర బౌలర్లలో ముఖేష్‌ చౌదరి 5 వికెట్లు పడగొట్టగా.. రజనీష్ గుర్బానీ మూడు వికెట్లు, రామక్రిష్ణ రెండు వికెట్లు సాధించారు.

బరోడా బ్యాటర్లలో అతి సేథ్‌(51) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా..జ్యోత్స్నిల్ సింగ్(40) పరుగులతో రాణించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో బరోడా కెప్టెన్‌ కృనాల్‌ పాండ్యా(12, 6) తీవ్ర నిరాశపరిచాడు. 

కాగా మహారాష్ట్ర జట్టు 464/7 వద్ద తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. మహారాష్ట్ర బ్యాటర్లలో సౌరభ్ నవలే(126) సెంచరీతో మెరవగా..రామక్రిష్ణ(99), కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(89) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. 

అయితే మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 152 పరుగుల ఆధిక్యాన్ని జోడించి బరోడా ముందు 617 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. ఈ భారీ లక్ష్యాన్ని బరోడా చేధించడంలో చతకలపడింది. కాగా మహారాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు ఆలౌట్‌ కాగా..బరోడా 145 పరుగులకే తమ మొదటి ఇన్నింగ్స్‌లో కుప్పకూలింది.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌.. ప్రపంచంలో తొలి ప్లేయర్‌గా
 

Videos

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు