Breaking News

జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్‌గా రుతురాజ్‌! సంజూకు నో ఛాన్స్‌

Published on Tue, 09/24/2024 - 18:14

ఇరానీ ట్రోఫీ-2024లో భాగంగా లక్నో వేదికగా ముంబై, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఆక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. తాజాగా ఈ మ్యాచ్ కోసం 15 మంది సభ్యులతో కూడిన రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది.

ఈ జట్టుకు టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఎంపిక‌య్యాడు. అత‌డి డిప్యూటీగా బెంగాల్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.  ఈ జ‌ట్టులో సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్‌, ఇషాన్ కిష‌న్ వంటి స్టార్ ఆట‌గాళ్ల‌కు చోటు ద‌క్కింది. 

అయితే దులీప్ ట్రోఫీలో సెంచ‌రీతో చెల‌రేగిన సంజూ శాంస‌న్‌కు మాత్రం బీసీసీఐ సెల‌క్ట‌ర్లు మొండి చేయిచూపించింది. అత‌డికి ఇరానీ ట్రోఫీ జ‌ట్టులో చోటు ఇవ్వ‌లేదు. అదే విధంగా బంగ్లాతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన భార‌త క్రికెట‌ర్లు ధ్రువ్ జురెల్‌, యష్ దయాల్‌ను ఈ జ‌ట్టులో సెలెక్ట‌ర్లు చేర్చారు. దీంతో వీరిద్దరూ రెండు టెస్టుకు బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశముంది. మ‌రోవైపు ఈ ఇరానీ కప్‌లో ముంబై జ‌ట్టుకు సీనియ‌ర్ ఆట‌గాడు అజింక్యా ర‌హానే సార‌థ్యం వ‌హించ‌నున్నాడు.

ఇరానీ ట్రోఫీకి రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), అభిమన్యు ఈశ్వరన్ (వైస్ కెప్టెన్‌), సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్‌)*, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్‌), మానవ్ సుతార్, సరాంశ్ జైన్, ప్రసిద్ధ్ కృష్ణ, ముఖేష్ కుమార్, యష్ దయాల్*, రికీ భుయ్, శాశ్వత్ రావత్, ఖలీల్ అహ్మద్, రాహుల్ చాహర్
చదవండి: ఫియర్‌లెస్‌ క్రికెట్‌ ఆడుతున్నాం.. ట్రోఫీ మాదే: హర్మన్
 

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు