Breaking News

BCCI Contracts: రుతురాజ్ గైక్వాడ్‌కు భారీ షాక్‌.. !

Published on Wed, 03/26/2025 - 18:52

భార‌త క్రికెట్ బోర్డు(బీసీసీఐ) 2025-26 ఏడాదికి గాను ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ఒకట్రెండు రోజుల్లో ప్ర‌క‌టించే అవ‌కాశ‌ముంది. ఈసారి ఆట‌గాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో ప‌లు మార్పులు చోటు చేసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తేడాది కాంట్రాక్టు కోల్పోయిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు ప్రమోషన్ దక్కనున్నట్లు సమాచారం. అతని సెంట్రల్ కాంట్రాక్ట్‌ను పునరుద్దరించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు వినికిడి.

అదేవిధంగా ఏ కేట‌గిరీలో ఉన్న‌ టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్‌ను A+ కేటగిరీకి బీసీసీఐ ప్ర‌మోట్ చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అదేవిధంగా టీ20ల‌కు విడ్కోలు ప‌లికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు A+ కేటగిరీలు కోల్పోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే A+ కేటగిరీలో కొన‌సాగాలంటే మూడు ఫార్మాట్‌లో ఆడాల్సిందే. 

రుతురాజ్ గైక్వాడ్‌కు భారీ షాక్‌.. !
ఇక ఇది ఇలా ఉండ‌గా.. టీమిండియా ఓపెన‌ర్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు భారీ షాక్ త‌గిలే అవ‌కాశ‌ముంది. అత‌డిని సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి త‌ప్పించేందుకు బీసీసీఐ సిద్ద‌మైన‌ట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రుతురాజ్ గ‌త కొంత కాలంగా జాతీయ జ‌ట్టుకు దూరంగా ఉంటున్నాడు. అత‌డికి వ‌చ్చిన అవ‌కాశాల‌ను కూడా గైక్వాడ్ స‌ద్వినియోగ ప‌రుచుకోలేక‌పోయాడు. ఈ క్ర‌మంలోనే అత‌డిని కాంట్రాక్ట్ నుంచి త‌ప్పించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.  గ‌తేడాది అత‌డు భార‌త్ త‌ర‌పున కేవ‌లం 4 టీ20లు మాత్ర‌మే ఆడాడు. 

చివ‌ర‌గా జింబాబ్వేతో జ‌రిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా త‌ర‌పున రుతురాజ్ ఆడాడు. ఈ సిరీస్‌లో 4 మ్యాచ్‌లు ఆడి 133  ప‌రుగులు చేశాడు. ఓవరాల్‌గా గైక్వాడ్ త‌న కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్ త‌ర‌పున 6 వ‌న్డేలు, 23 టీ20లు ఆడాడు. కాగా గైక్వాడ్‌కు ఎక్కువ అవ‌కాశాలు ఇవ్వలేద‌న్న ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి.

కేటగిరి వారీగా ఆటగాళ్లకు ద‌క్కే మొత్తం ఎంతంటే?
ఏ ప్లస్‌ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘ఏ’ కేటగిరీలోని క్రికెటర్లకు రూ. 5 కోట్లు..‘బి’ కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం లభించనుంది.

Videos

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)