Breaking News

టీ20 ముంబై లీగ్‌లో అర్జున్ టెండూల్క‌ర్ విధ్వంసం!

Published on Tue, 06/09/2026 - 07:12

టీ20 ముంబై లీగ్ 2026 సీజ‌న్‌లో అర్జున్ టెండూల్క‌ర్ విజృంభించాడు. టోర్నీలో ఏఆర్‌సీఎస్ అంధేరీ త‌ర‌ఫున ఆడుతున్న అర్జున్ సోమ‌వారం బాంద్రా బ్లాస్ట‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో మెరిశాడు. మొద‌ట బౌలింగ్‌లో మూడు వికెట్లు (3-1-11-3) కెరీర్ బెస్ట్ ప్ర‌ద‌ర్శ‌న న‌మోదు చేశాడు. 

ఆ త‌ర్వాత బ్యాటింగ్‌లో వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన అర్జున్ టెండూల్క‌ర్ 34 బంతుల్లోనే 66 ప‌రుగులు అజేయ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌లో వ‌న్‌మ్యాన్ షో ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్స‌ర్లు ఉన్నాయి. 25 బంతుల్లోనే ఫిప్టీ మార్క్‌ను అందుకున్న‌ అర్జున్ మ్యాచ్‌లో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కించుకున్నాడు. 

అర్జున్ విధ్వంసంతో అంధేరీ 145 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 13.5 ఓవ‌ర్ల‌లోనే ఒక్క వికెట్ మాత్ర‌మే కోల్పోయి ఛేదించింది. ఓపెన‌ర్ ముషీర్‌ఖాన్ (38 బంతుల్లో 58 నాటౌట్‌) అజేయ అర్థ‌సెంచ‌రీ సాధించాడు. అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన బాంద్రా బ్లాస్ట‌ర్స్ అర్జున్ టెండూల్క‌ర్ ధాటికి 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 144 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. 

ఓమ్ కేశ్‌కామ‌త్ (36 బంతుల్లో 49) టాప్ స్కోర‌ర్ కాగా, సాగ‌ర్ ఛాబ్రియా (23 బంతుల్లో 44) రాణించాడు. అర్జున్ మూడు వికెట్లు తీయ‌గా, ప్ర‌సూన్ సింగ్ 2, అజ‌మ్ మిశ్రా, శివ‌మ్ దూబే, ముషీర్ ఖాన్‌, ప్ర‌గ్నేశ్‌లు త‌లా ఒక వికెట్ ప‌డ‌గొట్టారు.ఇటీవ‌లే ముగిసిన ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో అర్జున్ టెండూల్క‌ర్ ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. ఆడింది ఒక్క మ్యాచ్ అయిన‌ప్ప‌టికీ, త‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో ప‌ర్వాలేద‌నిపించాడు. బౌలింగ్‌లో 4 ఓవ‌ర్లు వేసిన అర్జున్ 36 ప‌రుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)