Breaking News

మా వల్ల కాదంటూ మరో ఫ్రాంచైజీ అవుట్‌

Published on Tue, 09/23/2025 - 07:35

న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌)కు మరో ఫ్రాంచైజీ గుడ్‌బై చెప్పేసింది. లక్నో ఫ్రాంచైజీ యూపీ రుద్రాస్‌ లీగ్‌ నుంచి పూర్తిగా వైదొలగుతున్నట్లు ప్రకటించింది. నిర్వహణ సవాళ్ల కారణంగా లీగ్‌లో కొనసాగలేమని యాజమాన్యం వెల్లడించింది. భరించలేని 
ఆరి్థకభారం వల్లే లీగ్‌ నుంచి తప్పుకుంటున్నామని స్పష్టం చేసింది. ఇది చాలా కఠినమైన నిర్ణయమని యూపీ రుద్రాస్‌ టీమ్‌ డైరెక్టర్‌ సెడ్రిక్‌ డిసౌజా తెలిపారు. ‘హాకీ ఇండియా మొదలుపెట్టిన హెచ్‌ఐఎల్‌ మేం ఎంతో విలువిచ్చాం. 

ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటాం. కానీ ఆర్థిక సవాళ్లు మమ్మల్ని లీగ్‌లో కొనసాగేందుకు అసాధ్యంగా మార్చాయి. దీర్ఘ కాలిక లక్ష్యాలతో పనిచేసే అవకాశం లేకపోవడంతో తప్పుకుంటున్నాం. అయితే భారత్‌లో హాకీ ఉన్నత శిఖరాల్లో నిలువాలని ఆకాంక్షిస్తున్నాం’ అని సెడ్రిక్‌ డిసౌజా అన్నారు. ఈ జట్టుకు ఆడిన భారత హాకీ వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ సింగ్‌ మాట్లాడుతూ యూపీ రుద్రాస్‌కు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పాడు. 

అభిమానులు సైతం మా జట్టును ఆదరించారని అన్నాడు. కానీ ఇప్పుడా అధ్యాయం ముగిసిపోవడం విచారకరమన్నాడు. లీగ్‌కు దూరమైన మూడో జట్టు రుద్రాస్‌. ఇదివరకే మహిళల చాంపియన్‌ జట్టు ఒడిశా వారియర్స్‌ సహా పురుషుల్లో గోనాసిక టీమ్‌ లీగ్‌కు రాంరాం చెప్పాయి. దీంతో వచ్చే సీజన్‌ కోసం రాంచీ రాయల్‌ టస్కర్స్‌ (ఇరు విభాగాల్లో)తో రెండు జట్లను భర్తీ చేసుకోగా... తాజాగా హాకీ ఇండియా (హెచ్‌ఐ)కి రుద్రాస్‌ షాకిచ్చింది.    

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)