Breaking News

పంజాబ్‌తో రాజస్తాన్‌ కీలకపోరు..గెలిస్తే నిలుస్తారు.. లేదంటే ఇంటికే!

Published on Fri, 05/19/2023 - 12:49

ఐపీఎల్‌-2023లో భాగంగా శుక్రవారం ధర్మశాల వేదికగా కీలక మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు ఓడినా ఇంటిముఖం పట్టక తప్పదు. రాజస్తాన్‌ విషయానికి వస్తే.. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన రాయల్స్‌ ఆరింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.

అయితే రాజస్తాన్‌కు ప్లే ఆఫ్స్‌కు చేరే దారులు ఇంకా మూసుకుపోలేదు. పంజాబ్‌తో జరగనున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ విజయం సాధిస్తే..శాంసన్ సేన ప్లేఆఫ్స్‌ రేసులో నిలుస్తోంది. అయితే రాజస్తాన్‌ భవితవ్యం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్‌ తమ తదపరి మ్యాచ్‌ల్లో ఓటమి చెందితే.. ఈ మూడు జట్లు 14 పాయింట్లతో సమంగా నిలుస్తాయి.

అప్పుడు నెట్‌రన్‌రేట్‌ కీలకమవుతోంది. అయితే ముంబై, ఆర్సీబీ కంటే రాజస్తాన్‌(+0.140) నెట్‌రన్‌రేట్‌ మెరుగ్గా ఉండడంతో ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించే ఛాన్స్‌ ఉంటుంది.  ఇక పంజాబ్‌కు కూడా ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలు మెథ్యమేటిక్‌గా ఉన్నాయి.

పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌ చేరాలంటే కచ్చితంగా రాజస్తాన్‌పై భారీ విజయం సాధించాలి. అంతే కాకుండా ముంబై, ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌ ఓటమి పాలవ్వాలి. అప్పుడు ఈ మూడు జట్లు 14 పాయింట్లతో సమమవుతాయి. అప్పుడు నెట్‌రన్‌ను పరిగణలోకి తీసుకుంటారు. 

ట్రెంట్‌ బౌల్ట్‌ ఎంట్రీ.. జంపా ఔట్‌
ఇక పంజాబ్‌తో కీలక మ్యాచ్‌లో రాజస్తాన్‌ తమ జట్టులో ఒకే మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన స్టార్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ పంజాబ్‌తో పోరుకు తిరిగి జట్టులోకి రానున్నట్లు సమాచారం. బౌల్ట్‌ తుది జట్టులోకి వస్తే స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా బెంచ్‌కే పరిమితమయమ్యే ఛాన్స్‌ ఉంది. అదే విధంగా ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌పై రాజస్తాన్‌ మెనెజెమెంట్‌ మరోసారి నమ్మకం ఉంచనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రాజస్తాన్‌ తుది జట్టు(అంచనా): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్( కెప్టెన్‌), జో రూట్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, కేఎం ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్.
చదవండి: IPL 2023 Playoffs: ఓటమి వ్యత్యాసం కూడా కీలకమే.. రాజస్తాన్‌ ఆ విషయం మర్చిపోయినట్టుంది!


 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)