Breaking News

రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా కుమార సంగక్కర

Published on Mon, 11/17/2025 - 12:44

ఐపీఎల్‌-2026 సీజన్‌కు ముం‍దు రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తమ కోచింగ్ స్టాప్‌లో కీలక మార్పులు చేసింది. తమ జట్టు హెడ్‌కోచ్‌గా శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కరను రాజస్తాన్ నియమించింది. గత సీజన్‌లో రాయల్స్ ప్రధాన కోచ్‌గా పనిచేసిన రాహుల్ ద్రవిడ్ స్దానాన్ని సంగక్కర భర్తీ చేయనున్నాడు.

హెడ్‌కోచ్‌తో పాటు రాజస్తాన్ రాయల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా కూడా అతడు తన సేవలను అందించాడు. సంగక్కర గతంలో కూడా ఇదే పదవుల్లో కొనసాగాడు. ఈ శ్రీలంక మాజీ కెప్టెన్ 2021లో రాజస్థాన్ ఫ్రాంచైజీలో చేరాడు. డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా కెరీర్ ప్రారంభించిన అతడు కోచ్‌గా నియమితులయ్యాడు. అతడి దిశానిర్దేశనంలో రాజస్తాన్ నాలుగు పర్యాయాలు ప్లే ఆఫ్స్ ఆడింది. 

అయితే ఐపీఎల్‌-2025 సీజన్‌కు ముందు రాహుల్ ద్రవిడ్ రాకతో సంగాను రాజస్తాన్ పక్కన పెట్టింది. ఇప్పుడు ద్రవిడ్ తన పదవి నుంచి వైదొలగడంతో సంగక్కర మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ విషయాన్ని రాయల్స్ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరిచింది. రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు రెండో ఐపీఎల్ టైటిల్‌ను అందించేందుకు అన్ని విధాల ప్ర‌య‌త్నిస్తాను అని అత‌డు పేర్కొన్నాడు.

అదేవిధంగా బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న విక్రమ్ రాథోడ్‌ను లీడ్ అసిస్టెంట్ కోచ్‌గా రాజస్తాన్ ప్రమోట్ చేసింది. మాజీ న్యూజిలాండ్ స్టార్ షేన్ బాండ్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగనున్నాడు. ఇంగ్లండ్ మాజీ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్ ట్రెవ‌ర్ పెన్నీ తిరిగి అసిస్టెంట్ కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు.

రాజ‌స్తాన్‌కు కొత్త కెప్టెన్‌..
ఇక ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్‌కు కొత్త కెప్టెన్ రానున్నాడు. మినీ వేలానికి ముందు రాజ‌స్తాన్ ఫ్రాంచైజీ త‌మ కెప్టెన్ సంజూ శాంస‌న్‌ను చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను ట్రేడ్ చేసింది. సీఎస్‌కే నుంచి ర‌వీంద్ర జ‌డేజా, సామ్ కుర్రాన్ వంటి స్టార్ ఆల్‌రౌండ‌ర్ల‌ను రాజ‌స్తాన్ సొంతం చేసుకుంది. అయితే రాబోయో సీజ‌న్‌లో రియాన్ ప‌రాగ్ రాజ‌స్తాన్ కెప్టెన్‌గా ఎంపికయ్యే అవ‌కాశ‌ముంది.
చదవండి: IND vs SA: తొలి టెస్టులో ఓటమి.. గౌతమ్‌ గంభీర్‌ కీలక నిర్ణయం

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)