ధోని కంటే రోహిత్ చాలా డిఫ‌రెంట్ కెప్టెన్‌: హ‌ర్భ‌జ‌న్

Published on Tue, 09/03/2024 - 08:50

ఎంఎస్ ధోని, రోహిత్ శ‌ర్మ‌.. ఇద్ద‌రూ భార‌త క్రికెట్ జ‌ట్టుకు వ‌ర‌ల్డ్‌క‌ప్‌లు అందించిన కెప్టెన్‌లు. అయితే రోహిత్ గొప్ప‌, ధోని గొప్ప అంటే మాత్రం స‌మాధ‌నం చెప్ప‌లేం. ఎందుకంటే కెప్టెన్సీలో గానీ, ఆట‌లో గానీ ఎవ‌రికి వారే మేటి. తాజాగా ధోని, రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీ శైలుల గురించి భార‌త మాజీ క్రికెట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ధోని, రోహిత్ ఇద్ద‌రూ వేర్వేరు కెప్టెన్సీ స్టైల్స్‌ను క‌లిగి ఉన్నార‌ని భ‌జ్జీ చెప్పుకొచ్చాడు.

కెప్టెన్సీలో ధోని, రోహిత్‌ల‌కు ఎటువంటి పోలిక లేదు. ఇద్ద‌రూ వేర్వేరు కెప్టెన్సీ శైలిల‌ను క‌లిగి ఉన్నారు. ధోని కెప్టెన్సీలో నేను భార‌త జ‌ట్టుతో పాటు ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ఆడాడు. హైద‌రాబాద్‌తో మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో కేన్ విలియ‌మ్సన్ వ‌రసుగా బౌండ‌రీలు బాది ఒత్త‌డిలోకి నెట్టాడు.

 ఆ స‌మ‌యంలో షార్ట్ ఫైన్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాను. వెంట‌నే ధోని వ‌ద్ద‌కు వెళ్లి ఠాకూర్ త‌న బౌలింగ్ లెంగ్త్‌ను మార్చుకుంటే బాగుంటుంద‌ని సూచించాను. కానీ ధోని మాత్రం పాజీ నేను ఇప్పుడు అత‌నితో చెబితే, శార్ధూల్ ఎప్ప‌టికీ నేర్చుకోడు. త‌నంత‌ట తానే నేర్చుకోనివ్వండి అంటూ నాతో అన్నాడు. 

ఇది ధోని స్టైల్ కెప్టెన్సీ. ఇక రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీ మ‌రో ర‌కం.  రోహిత్ చాలా డిఫరెంట్. అతను వెళ్లి ప్రతి ప్లేయర్‌తో మాట్లాడతాడు. ఆట‌గాడి భుజం మీద చేయి వేసి త‌న నుంచి ఏమి ఆశిస్తున్నాడో చెబుతాడు. మీరు చేయగలరన్న న‌మ్మ‌కం అత‌డు క‌లిగిస్తాడు. 

టెస్టు క్రికెట్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన‌ప్ప‌టి నుంచి హిట్‌మ్యాన్ మరింత మెరుగయ్యాడు. ఎవ‌రైనా టెస్టుల్లో జ‌ట్టును న‌డిపించిన‌ప్పుడు చాలా విష‌యాలు నేర్చుకుంటారు. టెస్ట్ క్రికెట్‌కు ఖచ్చితమైన వ్యూహాలు, వాటని అమ‌లు చేయ‌డం చాలా అవ‌సరం. దీంతో ఒక ఉత్తమ నాయకుడిగా నిలుస్తారని "తరువర్ కోహ్లీ పోడ్‌కాస్ట్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ పేర్కొన్నాడు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)