Breaking News

నా నిర్ణ‌యంతో మా నాన్న చాలా ఫీల‌య్యారు: రోహిత్‌ శర్మ

Published on Fri, 06/06/2025 - 13:59

టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్‌ ఇటీవలే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కీలకమైన ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించి అందరికి షాకిచ్చారు. అయితే హిట్‌మ్యాన్‌ నిర్ణయంతో కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, అతడి తండ్రి గురునాథ్ శర్మ సైతం నిరాశ‌కు లోన‌య్యారంట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా రోహిత్‌నే వెల్ల‌డించాడు.

"మా నాన్న.. నేను రెడ్ బాల్‌తో క్రికెట్ ఆడ‌టం ఎక్కువగా చూశారు. అందుకే ఆయ‌న‌కు టెస్టు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నేను టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డంతో ఆయ‌న కొంచెం నిరాశ‌చెందారు. అదే స‌మ‌యంలో నా సుదీర్ఘ కెరీర్ ప‌ట్ల ఆయ‌న‌ సంతోషం కూడా వ్యక్తం చేశారు.

ఈ రోజు ఈస్ధాయికి నేను చేరుకున్నానంటే అందులో కీల‌క పాత్ర మా నాన్న‌దే. త‌ల్లిదండ్రులు స‌పోర్ట్ లేకుండా మ‌నం ఏదీ సాధించ‌లేము. నాకు కూడా టెస్టు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నా కెరీర్ తొలి రోజు నుంచే  ఆయ‌న టెస్టు క్రికెట్‌కు అభిమానిగా మారారు. 

నేను వ‌న్డేలో 264 ప‌రుగులు చేసిన రోజు నాకు ఇంకా ఇప్ప‌టికి బాగా గుర్తుంది. ఆ రోజు మాన్న నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఏదో మొక్కుబ‌డిగా బాగా ఆడావని ప్ర‌శంసించారు. అంతే తప్ప అతనిలో ఎటువంటి ఉత్సాహం కన్పించలేదు" అని ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ పేర్కొన్నాడు.

రోహిత్ తన టెస్ట్ కెరీర్‌లో 67 మ్యాచ్‌లు ఆడి 40.57 సగటుతో 4,301 పరుగులు సాధించారు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. 2019లో దక్షిణాఫ్రికాపై సాధించిన 212 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరు. కెప్టెన్‌గా 24 టెస్టులకు నాయకత్వం వహించి, 12 విజయాలు, 9 ఓటములు, 3 డ్రాలు నమోదు చేశాడు.
చదవండి: IND vs ENG; 'అతడికి చాలా అనుభవం ఉంది.. ఇంగ్లండ్ టూర్‌లో కీలకం కానున్నాడు'

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)