Breaking News

రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ అప్పుడే.. కన్ఫర్మ్ చేసిన కోచ్‌

Published on Sun, 10/26/2025 - 09:27

వైట్‌బాల్‌ క్రికెట్‌లో టీమిండియా ముఖ చిత్రంగా నిలిచిన స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ.. మరోసారి తన మార్క్‌ను చూపించాడు. ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రోహిత్‌ శర్మ, ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టాడు.

తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటికి ఆ తర్వాత రెండు వన్డేల్లో సత్తాచాటాడు. అడిలైడ్‌లో 73 పరుగులు చేసిన హిట్‌మ్యాన్‌.. ఇప్పుడు సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో సెంచరీతో చెలరేగాడు. 38 ఏళ్ల వయసులోనూ అతని ఆట తీరు,  షాట్ సెలెక్షన్ ఫ్యాన్స్‌ను మంత్రముగ్ధులను చేశాయి.

చివరిసారిగా ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన రోహిత్‌.. తన అద్బుత సెంచరీతో అభిమానులకు మరుపురాని ఇన్నింగ్స్‌ను అందించాడు. 237 పరగుల లక్ష్య చేధనలో ఆసీస్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ 125 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 121 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

ఆసీస్‌ టూర్‌ తర్వాత వన్డేలకు కూడా రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడన్న ఉహగానాలకు తన సెంచరీతోనే హిట్‌మ్యాన్‌ తెరదించాడు. వన్డే వరల్డ్‌కప్‌-2027లో ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాము అని మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ తెలిపాడు. ఇక రోహిత్‌ భవిష్యత్తు ప్రణాళికలపై అతడి చిన్ననాటి కోచ్‌ దినేష్ లాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిట్‌మ్యాన్‌ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడుతాడని లాడ్‌ కూడా స్పష్టం చేశారు.

"రోహిత్‌లో ఇంకా పరుగుల దాహం తీరలేదు.  అతడు ఈ మ్యాచ్‌లో అతడు బ్యాటింగ్‌ చేసిన విధానం, భారత జట్టును గెలిపించిన తీరు నిజంగా అద్భుతం. రోహిత్‌ తను ఎప్పుడు రిటైర్‌ అవ్వాలో ఇప్పటికే నిర్ణయించుకున్నాడు.  2027 వన్డే ప్రపంచ కప్ ఆడి ఆ తర్వాత రిటైర్ అవుతాడని" లాడ్‌ పేర్కొన్నాడు.

కాగా రోహిత్‌ శర్మ తన కెరీర్‌లో టీ20 వరల్డ్‌కప్‌, ఆసియాకప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీలు గెలుచుకున్నప్పటికి.. వన్డే వరల్డ్‌కప్‌ అందని ద్రాక్షగా మిగిలిపోయింది. 2011 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో రోహిత్‌ భాగంగా లేడు. ఆ  తర్వాత 2015, 2019, 2023 ప్రపంచకప్‌లలోనూ అతడికి నిరాశే ఎదురైంది. దీంతో మరో రెండేళ్లలో జరిగే వరల్డ్‌కప్‌ను గెలుకుని తన కెరీర్‌కు ముగింపు పలకాలని రోహిత్‌ నిర్ణయించుకున్నాడు.
చదవండి: ఆస్ట్రేలియా క్రికెట‌ర్ల‌కు సారీ చెప్పిన బీసీసీఐ..

Videos

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

మహిళలపై TDP మూకలు ఎలా దాడి చేశారో చూడండి

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

ABN రాధాకృష్ణ... నీ ఫామ్ హౌస్ బాగోతం.. కారుమూరి సంచలన కామెంట్స్

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్