చెత్త షాట్‌ ఆడి ఔటైన శుబ్‌మన్‌ గిల్‌.. కోపంతో చూసిన రోహిత్‌! వీడియో వైరల్‌

Published on Sun, 11/19/2023 - 15:27

వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్లో టీమిండియా యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ తీవ్ర నిరాశపరిచాడు. 7 బంతులు ఆడిన గిల్‌ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ టీమిండియా బ్యాటింగ్‌ను ఆ‍హ్హనించాడు. ఈ క్రమంలో భారత్‌ ఇన్నింగ్స్‌ 5 ఓవర్‌ వేసిన మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో రెండో బంతిని గిల్‌ మిడాన్‌ దిశగా షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు.

అయితే షాట్‌ సరిగ్గా కనక్ట్‌ కాకపోవడంతో బంతి మిడాన్‌లో ఉన్న ఆడమ్‌ జంపా చేతికి బంతి వెళ్లింది. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా సైలెంట్‌ అయిపోయింది. ఈ క్రమంలో నాన్‌స్ట్రైక్‌లో ఉన్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గిల్‌ వైపు కోపంతో చూశాడు. ఎందుకంటే స్టార్క్‌ వేసిన షార్ట్‌ లెంగ్త్‌ బాల్‌కు గిల్‌ ఆ షాట్‌ ఆడాల్సిన అవసరం లేదు.

కీలక మ్యాచ్‌లో అనవసర షాట్‌ ఆడి గిల్‌ తన వికెట్‌ కోల్పోయాడు. ఈ క్రమంలోనే రోహిత్‌ గిల్‌ వైపు సీరియస్‌గా చూశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఫైనల్‌ పోరులో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న టీమిండియా 18 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి(35), కేఎల్‌ రాహుల్‌ (15) పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నారు. రోహిత్‌ శర్మ(47), శుబ్‌మన్‌ గిల్‌(4), శ్రేయస్‌ అయ్యర్‌(4) పరుగులు చేసి ఔటయ్యారు.
చదవండి: ODI World Cup Final: రోహిత్‌ శర్మ- గిల్‌ అరుదైన రికార్డు.. వరల్డ్‌కప్‌ చరిత్రలోనే

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)