Breaking News

అప్ప‌టివ‌ర‌కు భార‌త కెప్టెన్ అత‌డే.. బీసీసీఐ సెక్ర‌ట‌రీ కీల‌క ప్ర‌క‌ట‌న‌

Published on Sun, 07/07/2024 - 15:21

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ విజ‌య‌నంత‌రం టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్ విడ్కోలు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. ఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచే త‌న చివ‌రిద‌ని రోహిత్ సృష్టం చేశాడు. అయితే టీ20ల్లో రోహిత్ వారసుడు ఎవరన్నది బీసీసీఐ ఇప్పటివరకు ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదు.

టీ20ల్లో భారత కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను నియమించే అవకాశమున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అయితే రోహిత్ టీ20ల నుంచి తప్పుకోవడం‍తో మిగితా ఫార్మాట్లలో భారత కెప్టెన్‌గా కొనసాగుతాడా లేదా అన్న సందిగ్ధం అభిమానుల్లో నెలకొంది.

 తాజాగా ఈ విషయంపై బీసీసీఐ సెక్రటరీ జై షా క్లారిటీ ఇచ్చారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్, ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భార‌త జ‌ట్టుకు రోహిత్ శ‌ర్మ‌నే సార‌థ్యం వ‌హిస్తాడ‌ని జై షా సృష్టం చేశాడు.

"గతేడాది నవంబర్  23న వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఓటమి పాలైనప్పటకి.. అభిమానుల మనసును మాత్రం గెలుచుకున్నాము. కానీ ఈ సారి జూన్ 29 న అభిమానుల హృదయాలతో పాటు కప్‌ను కూడా గెలుచుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఛాంపియన్స్‌గా నిలిచి బార్బడోస్‌లో భారత జెండాను ఎగురవేశాము. 

ఈ విజయం తర్వాత మాకు త్వరలోనే కొన్ని ఐసీసీ కీలక ఈవెంట్లు ఉన్నాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో మేము డబ్ల్యూటీసీ ఫైనల్, ఛాంపియన్స్ ట్రోఫీని గెలుస్తామన్న నమ్మకంగా మాకు ఉందని బీసీసీఐ షేర్ చేసిన వీడియోలో జైషా పేర్కొన్నాడు.

కాగా.. పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాదిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అయితే.. భారత జట్టుని పాక్‌ను పంపిస్తారా? భారత జట్టు మ్యాచ్‌లను హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహిస్తారా? అన్నది ఇంకా నిర్ణయించలేదు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)