Breaking News

'ఆస్ట్రేలియా సిరీస్‌ రోహిత్‌కు చాలా కీలకం.. కెప్టెన్‌గా అదరగొడతాడు'

Published on Fri, 02/03/2023 - 21:09

భారత్‌-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌  నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా అద్భుతంగా రాణిస్తాడని బంగర్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా వంటి మేటి జట్టుపై టెస్టుల్లో రాణించేందుకు హిట్‌మ్యాన్‌ ఆసక్తిగా ఉన్నాడని బంగర్ తెలిపాడు.

కాగా రోహిత్‌ శర్మకు ఈ టెస్టు సిరీస్‌ చాలా కీలకం. ఎందుకంటే కెప్టెన్‌గా రోహిత్‌ బాధ్యతలు చేపట్టాక పూర్తి స్థాయి టెస్టు సిరీస్ ఆడటం ఇదే తొలిసారి. జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత రోహిత్‌ కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడాడు.

"రోహిత్‌ శర్మకు ఈ సిరీస్‌ చాలా కీలకం. అతడు గాయం కారణంగా 2015 నుంచి 2018 వరకు చాలా టెస్టు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. 2018లో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో బ్యాటింగ్‌ పరంగా అద్భుతంగా రాణిస్తున్న దశలో రోహిత్‌.. వ్యక్తిగత కారణాల వల్ల కుటుంబంతో కలిసి స్వదేశానికి రావాల్సి వచ్చింది.

ఇక ఆసీస్‌తో సిరీస్‌ కోసం రోహిత్‌ ఆసక్తిగా ఎదురుచూస్తుంటాడు. రోహిత్‌ ఇప్పటికే టెస్టుల్లో ఇంగ్లండ్‌ వంటి విదేశీ పిచ్‌లపై ఓపెనర్‌గా అద్భుతంగా రాణించాడు. అదే విధంగా భారత్‌లో కూడా హిట్‌మ్యాన్‌ టెస్టుల్లో ఎన్నో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడాడు. కాబట్టి అతడు ఆస్ట్రేలియాపై కూడా మెరుగ్గా రాణిస్తాడని నేను భావిస్తున్నాను. అదే విధంగా కెప్టెన్‌గా కూడా జట్టుకు సిరీస్‌ను అందిస్తాడని"  స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బంగర్‌ పేర్కొన్నాడు.
చదవండి: BGT 2023: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌.. భారత్‌కు గుడ్‌ న్యూస్‌! యార్కర్ల కింగ్‌ వచ్చేస్తున్నాడు

Videos

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)