Breaking News

తలో స్థానం మెరుగుపర్చుకున్న రోహిత్‌, జైస్వాల్‌, విరాట్‌

Published on Wed, 09/11/2024 - 14:40

ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి తలో స్థానం మెరుగుపర్చుకున్నారు. ఈ ముగ్గురు తాజా ర్యాంకింగ్స్‌లో ఐదు, ఆరు, ఏడు స్థానాలకు ఎగబాకారు. గత కొంతకాలంగా భారత్‌ టెస్ట్‌ క్రికెట్‌ ఆడనప్పటికీ ఈ ముగ్గురి ర్యాంకింగ్స్‌ మెరుగుపడటం గమనార్హం. 

వీరితో పాటు టాప్‌-10లో ఉస్మాన్‌ ఖ్వాజా, మొహమ్మద్‌ రిజ్వాన్‌, మార్నస్‌ లబూషేన్‌ కూడా తలో స్థానం మెరుగుపర్చుకుని ఎనిమిది, తొమ్మిది, పది స్థానాలకు చేరారు. జో రూట్‌, కేన్‌ విలియమ్సన్‌, డారిల్‌ మిచెల్‌, స్టీవ్‌ స్మిత్‌ టాప్‌-4 బ్యాటర్లుగా కొనసాగుతున్నారు.

లంక ఆటగాళ్ల హవా
ఈ వారం ర్యాంకింగ్స్‌లో శ్రీలంక ఆటగాళ్లు భారీగా ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నారు. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌లో సత్తా చాటిన ధనంజయ డిసిల్వ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని 13వ స్థానానికి.. అదే టెస్ట్‌లో రాణించిన కమిందు మెండిస్‌ ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని 20వ స్థానానికి ఎగబాకారు. తాజా ర్యాంకింగ్స్‌లో భారీ లబ్ది పొందిన లంక ఆటగాళ్లలో పథుమ్‌ నిసాంక ముందువరుసగా ఉన్నాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన నిసాంక ఏకంగా 42 స్థానాలు మెరుగుపర్చుకుని 39వ స్థానానికి ఎగబాకాడు. ఇది మినహా టాప్‌-100 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు.

బౌలర్ల ర్యాంకింగ్స్‌లోనూ..!
టెస్ట్‌ బౌలర్ల ర్యాంకింగ్స్‌లోనూ లంక ఆటగాళ్లు భారీగా లబ్ది పొందారు. మిలన్‌ రత్నాయకే 26, విశ్వ ఫెర్నాండో 13, లహీరు కుమార 10 స్థానాలు మెరుగపర్చుకుని 85, 31, 32 స్థానాలకు ఎగబాకారు. ఈ విభాగంలో రవిచంద్రన్‌ అశ్విన్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, జస్ప్రీత్‌ బుమ్రా టాప్‌-3లో కొనసాగుతున్నారు. భారత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఏడో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

జడ్డూ@1.. అశ్విన్‌@2
టెస్ట్‌ ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. తాజా ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులేమీ లేవు. భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ 1, 2, 6 స్థానాలను నిలబెట్టుకున్నారు. లంక ఆటగాడు మిలన్‌ రత్నాయకే 22 స్థానాలు మెరుగుపర్చుకుని 51వ స్థానానికి చేరాడు. 

చదవండి: ’ముంబై ఇండియన్స్‌తో రోహిత్‌ ప్రయాణం ముగిసినట్టే’

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)