Breaking News

కోహ్లి 77 రోహిత్‌ 0

Published on Sat, 12/27/2025 - 08:48

బెంగళూరు: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (61 బంతుల్లో 77; 13 ఫోర్లు, 1 సిక్స్‌) దేశవాళీల్లో కూడా అద్భుత ఫామ్‌ కొనసాగిస్తున్నాడు. విజయ్‌ హజారే ట్రోఫీ తొలి మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుపై శతకంతో కదంతొక్కిన కోహ్లి... గుజరాత్‌తో శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో రాణించాడు. ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో భాగంగా జరిగిన ఈ పోరులో రిషభ్‌ పంత్‌ సారథ్యంలోని ఢిల్లీ జట్టు 7 పరుగుల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది. మొదట ఢిల్లీ నిరీ్ణత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కోహ్లి చక్కటి షాట్‌లతో అర్ధశతకంతో ఆకట్టుకోగా... రిషభ్‌ పంత్‌ (70; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. అనంతరం ఛేదనలో గుజరాత్‌ 47.4 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది.  

రోహిత్‌ ‘డకౌట్‌’ 
జైపూర్‌: సిక్కింతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారీ సెంచరీతో చెలరేగిన ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ శర్మ (0) ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో ‘గోల్డెన్‌ డకౌట్‌’ అయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగి నిరాశ పరిచాడు. అయినా శుక్రవారం జరిగిన ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లో ముంబై జట్టు 51 పరుగుల తేడాతో ఉత్తరాఖండ్‌పై గెలిచింది. మొదట ముంబై 50 ఓవర్లలో 7 వికెట్లకు 331 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హార్దిక్‌ తమోర్‌ (93 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌ కాగా... సర్ఫరాజ్‌ ఖాన్‌ (55; 5 ఫోర్లు, 1 సిక్స్‌), ముషీర్‌ ఖాన్‌ (55; 7 ఫోర్లు), షమ్స్‌ ములానీ (48; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ఛేదనలో ఉత్తరాఖండ్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 280 పరుగులకు పరిమితమైంది.    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)