Breaking News

రోహిత్‌ శర్మను ట్రాప్‌ చేసిన రబాడ.. వీడియో వైరల్‌

Published on Tue, 12/26/2023 - 15:24

సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నిరాశ పరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి రోహిత్‌ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. దక్షిణాఫ్రికా పేసర్‌ రబాడ ట్రాప్‌ చేసి మరి హిట్‌మ్యాన్‌ను పెవిలియన్‌ పంపాడు. ఫైన్‌ లెగ్‌లో ఫీల్డర్‌ను పెట్టి రోహిత్‌కు షార్ట్‌ బాల్‌ను రబాడ సంధించాడు.

ఈ క్రమంలో భారీ షాట్‌కు ప్రయత్నించిన రోహిత్‌.. ఫైన్‌ లెగ్‌ ఫీల్డర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో చేసేదేమి లేక రోహిత్‌ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023 ఓటమి అనంతరం రోహిత్‌కు ఇదే తొలి మ్యాచ్‌. కాగా టెస్టుల్లో రోహిత్‌ను రబాడ ఔట్‌ చేయడం ఇది 13వ సారి కావడం గమనార్హం.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే బిగ్‌ షాక్‌ తగిలింది. 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్‌(5), జైశ్వాల్‌(17), గిల్‌(2) తీవ్ర నిరాశపరిచారు. ఈ క్రమంలో భారత ఇన్నింగ్స్‌ను విరాట్‌ కోహ్లి(15), శ్రేయస్‌ అయ్యర్‌(9) చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 16 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 50/3. 
చదవండి: Adudam Andhra: ఏపీ క్రీడా సంబురం: టాలెంట్‌ హంట్‌లో CSK! ప్రణాళికాబద్ధంగా జగన్‌ ప్రభుత్వం

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)