Breaking News

చరిత్రకు అడుగు దూరంలో రోహిత్‌.. బద్దలు కానున్న 37 ఏళ్ల రికార్డు

Published on Fri, 06/12/2026 - 15:19

టీమిండియా స్టార్ ఓపెన‌ర్‌, మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ త‌న కెరీర్‌లో మ‌రో అరుదైన మైలు రాయిని అందుకునేందుకు సిద్ద‌మ‌య్యాడు. అఫ్గానిస్తాన్‌తో ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి వ‌న్డేలో బ‌రిలోకి దిగ‌నున్న రోహిత్‌..  భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక వయసులో వన్డే మ్యాచ్ ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు భారత మాజీ ప్లేయర్‌, 1983 వరల్డ్ కప్ విజేత జట్టు సభ్యుడు మొహిందర్ అమర్‌నాథ్ పేరిట ఉంది.

ఆయన 39 ఏళ్ల 36 రోజుల వయసులో 1989లో తన చివరి వన్డే ఆడారు. ఇప్పుడు 39 సంవత్సరాల 44 రోజుల వయస్సు కలిగిన హిట్‌మ్యాన్‌.. అమర్‌నాథ్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేయనున్నాడు. 2007లో భారత్ తరపున వన్డే అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ, 19 ఏళ్ల తన సేవలను అందిస్తూనే ఉన్నాడు.

కెరీర్ ఆరంభంలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్న రోహిత్‌..  ఎంఎస్ ధోని కెప్టెన్సీలో తిరుగులేని ఆటగాడిగా నిలిచాడు. ధోనీ 2013లో రోహిత్‌ను ఓపెనర్‌గా పంపడం ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఓపెనర్‌గా మారిన తర్వాతే రోహిత్ ప్రపంచ స్థాయి బ్యాటర్‌గా ఎదిగాడు. ఆ తర్వాత భారత జట్టు పగ్గాలను కూడా చేపట్టాడు. అతడి కెప్టెన్సీలోనే భారత్ 2023 ప్రపంచకప్‌ను తృటిలో కోల్పోయింది.

ఫైనల్ వరకు అజేయంగా నిలిచిన మెన్ ఇన్ బ్లూ, తుది మొట్టుపై బోల్తా పడింది. టీ20 ప్రపంచకప్‌-2026ను మాత్రం అతడి కెప్టెన్సీలోనే టీమిండియా గెలుచుకుంది. తన 19 ఏళ్ల కెరీర్‌లో రోహిత్ ఎన్నో ఘనతలు సాధించాడు. 

వన్డే క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా చారిత్రత్మక రికార్డును ఈ ముంబైకర్ కలిగి ఉన్నాడు. అంతేకాకుండా వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు (7 సెంచరీలు) చేసిన రికార్డు రోహిత్ పేరిటే ఉంది. రోహిత్ శ‌ర్మ ఇప్ప‌టివ‌ర‌కు  282 వన్డే మ్యాచ్‌ల్లో 11,577 పరుగులు సాధించాడు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)