Breaking News

నన్ను నవ్వించగలిగేది అతనే.. అప్పుడు చాలా బాధ పడ్డాను: రోహిత్‌ శర్మ

Published on Thu, 04/18/2024 - 15:33

క్లబ్‌ ప్రియారీ ఫైర్‌ అనే పోడ్‌కాస్ట్‌తో మాట్లాడుతూ టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చాలా ఆసక్తికర విషయాలు షేర్‌ చేసుకున్నాడు. ఐపీఎల్‌ 2024తో బిజీగా ఉన్న హిట్‌మ్యాన్‌ ఖాళీ సమయంలో క్లబ్‌ ప్రియారీతో మాట్లాడుతూ.. ధోని, దినేశ్‌ కార్తీక్‌, రిషబ్‌ పంత్‌ గురించి ఎన్నో విషయాలు పంచుకున్నాడు. 

నన్ను నవ్వించగలిగేది అతనే..
రిషబ్‌ పంత్‌ గురించి మాట్లాడుతూ.. టీమిండియాలో నన్ను ఎవరైనా నవ్వించగలరంటే అది పంత్‌ మాత్రమే. అతన్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. చాలా సరదాగా, ఉత్సాహంగా ఉంటాడు. నాకు నవ్వుకోవాలని అనిపించిన ప్రతిసారి అతనితో మాట్లాడతాను. ఏదో ఒకటి చెప్పి నవ్వించేస్తాడు.

వికెట్ల వెనక పంత్‌ చేసే కామెడీ అంతా ఇంతా కాదు. అందరూ పగలబడి నవ్వుతారు. అయితే కారు ప్రమాదం కారణంగా పంత్‌ అమూల్యమైన కెరీర్‌ను మిస్‌ కావడం నన్ను చాలా బాధించింది. ఇప్పటికైనా అతను బెస్ట్‌ అంటూ హిట్‌మ్యాన్‌ కితాబునిచ్చాడు.

ధోనిని ఒప్పించడం చాలా కష్టం.. డీకే అయితే ఈజీ
టీ20 వరల్డ్‌కప్‌ 2024 కోసం చాలా మంది రిటైర్డ్‌ క్రికెటర్లు (పాకిస్తాన్‌) తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారనే అంశంపై మాట్లాడుతూ.. రిటైర్మెంట్‌ వెనక్కు తీసుకోమని ధోనిని ఒప్పించడం చాలా కష్టం. ఎందుకంటే అతను బాగా అలసిపోయి ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో అతన్ని రిటైర్మెంట్‌ వెనక్కు తీసుకుని వరల్డ్‌కప్‌ ఆడమని అడగలేం. అడిగినా అతను ఒప్పుకోడు. ఇదే విషయంలో దినేశ్‌ కార్తీక్‌ను ఒప్పించడమయితే చాలా సులువే అని హిట్‌మ్యాన్‌ అన్నాడు. 

శభాష్‌ డీకే.. వరల్డ్‌కప్‌ ఆడాలని ఉన్నట్లుంది..
ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ధోని, దినేశ్‌ కార్తీక్‌ ఇద్దరు చాలా బాగా ఆడుతున్నారని రోహిత్ కితాబునిచ్చాడు. ఆర్సీబీతో మ్యాచ్‌ సందర్భంగా రోహిత్‌ డీకేను సరదాగా ఆటపట్టించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కార్తీక్‌ హిట్టింగ్‌ చేస్తుండగా రోహిత్‌ సరదాగా చేసిన కామెంట్స్‌ వైరలయ్యాయి. శభాష్‌ డీకే.. టీ20 వరల్డ్‌కప్‌కు సెలెక్ట్‌ కావాలని అడుతున్నట్లుంది. నీ మైండ్‌లో కూడా ఇదే నడుస్తున్నట్లుందని రోహిత్‌ డీకేను ఆటపట్టించాడు.

ధోనిలో ఆ పాత ఉత్సాహం ఇంకా ఉంది..
ఇదే సందర్భంగా రోహిత్‌.. ధోని ముంబైతో ఆడిన ఇన్నింగ్స్‌పై (4 బంతుల్లో 20 నాటౌట్‌) కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనిలో ఆ పాత ఉత్సాహం ఇంకా ఉంది. నాలుగు బంతులు ఆడి అతను మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. అతన్ని ఇన్నింగ్స్‌ తమ ఓటమిని శాశించింది. ధోని చేసిన 20 పరుగులే తమకు వారికి వ్యత్యాసం అంటూ గుర్తు చేసుకున్నాడు. 


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)