Breaking News

శభాష్‌ హిట్‌మ్యాన్‌.. పూజారా కోసం వికెట్‌ను త్యాగం చేసిన రోహిత్‌! వీడియో వైరల్‌

Published on Sun, 02/19/2023 - 13:14

ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి భారత్‌ దూసుకువెళ్లింది. 115 స్వల్ప లక్క్ష్యంతో బరిలోకి దిగిన  టీమిండియా 26. 4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ విషయం పక్కన పెడితే టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అభిమానుల మనసును గెలుచుకున్నాడు. తన కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న వెటరన్‌ బ్యాటర్‌ చతేశ్వర్‌ పూజారా కోసం రోహిత్‌ తన వికెట్‌ను త్యాగం చేశాడు.

టీమిండియా సెకెండ్‌ ఇన్నింగ్స్‌ 7వ ఓవర్‌ వేసిన కుహ్నెమన్ బౌలింగ్‌లో.. పుల్‌ టాస్‌ బంతిని రోహిత్‌ స్క్వేర్‌ ఆన్‌ సైడ్‌ ఆడాడు. అయితే తొలి పరుగును వీరిద్దరూ వేగంగా పూర్తి చేసుకున్నారు. అయితే రెండో పరుగు కోసం నాన్ స్ట్రైక్ ఎండ్‌ నుంచి రోహిత్‌ "నో" అని కాల్‌ ఇచ్చినప్పటికీ.. పూజారా మాత్రం పరిగెత్తూకుంటూ ముందుకు వచ్చేశాడు.

ఈ క్రమంలో రోహిత్‌ తన మనసు మార్చుకుని వెనుక్కి వెళ్లకుండా వికెట్‌ కీపర్‌ వైపు పరిగెత్తాడు. అంతలోనే ఆసీస్‌ ఫీల్డర్‌ హ్యాండ్‌కాంబ్‌ బంతిని  వికెట్‌ కీపర్‌ చేతి క్యారీకి చేతికి ఇచ్చాడు. దీంతో క్యారీ బెయిల్స్‌ను పడగొట్టడంతో రోహిత్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు.

ఇక తన వికెట్‌ను త్యాగం చేసిన రోహిత్‌ శర్మపై సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రోహిత్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 31 పరుగులు చేశాడు.


చదవండి: IND vs AUS: రవీంద్ర జడేజా అరుదైన ఘనత.. 31 ఏళ్ల తర్వాత ఇదే తొలి సారి

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?