Breaking News

Rohit Sharma: స్టోక్స్‌కు ఇదే తొలిసారి.. రోహిత్‌ రికార్డులివే!

Published on Mon, 02/26/2024 - 16:41

విరాట్‌ కోహ్లి, మహ్మద్‌ షమీ.. కేఎల్‌ రాహుల్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు జట్టులో లేకున్నా యువ జట్టుతో టీమిండియాకు అద్భుత విజయం అందించాడు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.  విరాట్‌, షమీ సిరీస్‌ మొత్తానికి.. గాయం కారణంగా రాహుల్‌ రెండో టెస్టు నుంచి జట్టుకు దూరం కాగా... నాలుగో టెస్టులో బుమ్రాకు విశ్రాంతినిచ్చారు.

ఈ నేపథ్యంలో రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు మినహా అంతగా అనుభవంలేని జట్టుతో బరిలోకి దిగిన టీమిండియా.. నాలుగో టెస్టులో ఘన విజయం సాధించింది.

ఆద్యంతం ఆసక్తిరేపిన ఈ రసవత్తర మ్యాచ్‌లో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌, శుబ్‌మన్‌ గిల్‌ అద్భుత ఇన్నింగ్స్‌లో గెలుపొందింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మరో టెస్టు మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో గెలిచింది. సొంతగడ్డపై వరుసగా పదిహేడవ సిరీస్‌ విజయం సాధించింది. 

బజ్‌బాల్‌ యుగంలో తొలి కెప్టెన్‌గా ఘనత
దీనికంతటికి రోహిత్‌ శర్మ నాయకత్వ ప్రతిభే కారణమంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. ‘బజ్‌బాల్‌’ యుగంలో ఇంగ్లండ్‌ను వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓడించిన కెప్టెన్‌, బెన్‌ స్టోక్స్‌కు తొలి సిరీస్‌ పరాజయం పరిచయం చేసిన సారథి(ROHIT SHARMA BECOMES THE FIRST CAPTAIN TO WIN A TEST SERIES AGAINST BAZBALL ERA)గా అరుదైన ఫీట్‌ నమోదు చేశాడంటూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసి
ఇదిలా ఉంటే.. రాంచి టెస్టు సందర్భంగా రోహిత్‌ శర్మ వ్యక్తిగతంగా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో తొమ్మిది వేల పరుగుల మార్కును అందుకున్నాడు. 

కాగా ఇంగ్లండ్‌తో శుక్రవారం మొదలైన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్‌ పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి దిగ్గజ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ క్యాచ్‌గా వెనుదిరిగాడు. అయితే, మ్యాచ్‌ ఫలితాన్ని తేల్చే కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం విలువైన అర్ధ శతకం(55) బాదాడు రోహిత్‌.

తద్వారా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు రోహిత్‌ శర్మ. అదే విధంగా టెస్టు మ్యాచ్‌లో నాలుగు వేల రన్స్‌కు పైగా స్కోరు చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 17వ భారత బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాదు.. ఇంగ్లండ్‌పై వెయ్యి పరుగుల మార్కును కూడా దాటేశాడు హిట్‌మ్యాన్‌. 

చదవండి: Virat Kohli: టీమిండియా గెలుపుపై స్పందించిన కోహ్లి.. పోస్ట్‌ వైరల్‌

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)