Breaking News

ట్రాప్‌లో చిక్కుకున్న రోహిత్.. అసలు ఆ షాట్ అవసరమా? వీడియో

Published on Sun, 11/03/2024 - 10:56

ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ  తీవ్ర నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 18 పరుగులు మాత్రమే చేసిన హిట్‌మ్యాన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 11 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు.

147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు రోహిత్ శర్మ శుభారంభం అందిస్తాడని భావించారు. కానీ రోహిత్ అందరి ఆశలను అడియాశలు చేశాడు. కివీ పేసర్ మాట్ హెన్రీ బౌలింగ్‌లో నిర్లక్ష్యపు షాట్ ఆడి రోహిత్ తన వికెట్‌ను కోల్పోయాడు.

ట్రాప్‌లో చిక్కుకున్న హిట్‌మ్యాన్‌..
రోహిత్ శర్మ సెకెండ్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తన ఫేవరేట్ ఫుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. తొలి ఓవర్ వేసిన మాట్ హెన్రీ బౌలింగ్‌లో రోహిత్ అద్బుతమైన బౌండరీ కూడా సాధించాడు. ఈ క్రమంలో భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసేందుకు హెన్రీ మళ్లీ ఎటాక్‌లో వచ్చాడు. 

అయితే సరిగ్గా ఇదే సమయంలో కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ తన కెప్టెన్సీ స్కిల్స్‌ను ప్రదర్శించాడు. లాథమ్ లాంగ్ ఆన్, మిడ్-ఆన్ మధ్యలో ఫీల్డర్‌ను ఉంచి రోహిత్‌కు  పుల్ షాట్ ఆడేందుకు అవకాశమిచ్చాడు.

ఈ నేపథ్యంలో మూడో ఓవర్ ఆఖరి బంతిని హెన్రీ బ్యాక్‌ఆఫ్‌ది లెంగ్త్ బాల్‌గా హిట్‌మ్యాన్‌కు సంధించాడు. దీంతో ఆ బంతిని రోహిత్ ఫుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. షాట్ సరిగ్గా కనక్ట్‌కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది.

దీంతో మిడ్-వికెట్‌లో ఉన్న గ్లెన్ ఫిలిప్స్ ఈజీ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్‌ శర్మపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఆ షాట్‌ ఆడాల్సిన అవసరం ఏముందని పోస్టులు పెడుతున్నారు.

ఇక సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో భారత్‌ 12 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్‌ పంత్‌(23), జడేజా(5)  ఉన్నారు. టీమిండియా విజయానికి ఇంకా 92 పరుగులు కావాలి.



 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)