Breaking News

రోహిత్ నా సోదరుడు.. మరింత ఎనర్జీతో ఆడాలి: హేడన్‌

Published on Mon, 12/16/2024 - 19:06

బ్రిస్బేన్ వేదిక‌గా జ‌రుగుత‌న్న మూడో టెస్టులో టీమిండియా దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ కేవ‌లం 51 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. మొద‌టి ఇన్నింగ్స్‌లో భార‌త్ ఇంకా 394 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది. ప్ర‌స్తుతం క్రీజులో కేఎల్ రాహుల్‌(33), రోహిత్ శ‌ర్మ (0)ఉన్నారు. నాలుగో రోజు ఆట‌లో భార‌త్ భవితవ్యం వీరిద్ద‌రిపైనే ఆధార‌ప‌డి ఉంది.

ఈ నేప‌థ్యంలో రోహిత్ శ‌ర్మ‌ను ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మాథ్యూ హేడెన్ ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్య‌లు చేశాడు. నాలుగో రోజు ఆట‌లో రోహిత్ త‌న‌దైన స్టైల్లో దూకుడుగా బ్యాటింగ్ చేయాల‌ని హేడెన్ సూచించాడు. కాగా అడిలైడ్ వేదిక‌గా జ‌రిగిన పింక్ బాల్ టెస్టులో మాత్రం దారుణంగా విఫ‌ల‌మయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌ల‌లోనూ సింగిల్ డిజిట్ స్కోర్‌కే ప‌రిమితమ‌య్యాడు.

"రోహిత్ శర్మ ఫార్మాట్ ఏదైనా స్వేచ్ఛగా ఆడుతూ ప‌రుగులు సాధిస్తాడు. వ‌న్డే క్రికెట్‌లో రెండు డ‌బుల్ సెంచ‌రీలు, పొట్టి ఫార్మాట్‌లలో అత‌డు రికార్డులే అందుకు నిద‌ర్శ‌నం. కానీ ఇప్పుడు అత‌డు ఏంటో మ‌ళ్లీ నిరూపించుకోవాల్సిన స‌మయం వ‌చ్చింది. బ్రిస్బేన్‌లో రోహిత్ త‌న కోస‌మైనా ఫుల్ ఎఫెక్ట్‌తో ఆడాలి. 

అత‌డు కొన్ని రోజుల విరామం త‌ర్వాత అడిలైడ్‌లో ఆడాడు. బ‌హుశా అందుకే రోహిత్ కాస్త నిదానంగా ఆడాడు. నేనే అత‌డితో పాటు క్రీజులో ఉండి ఉంటే, డిఫెన్స్ ఆడ‌టం ఇష్టం లేద‌ని చెప్పేవాడిని. రోహిత్ తన స్టైల్లో దూకుడుగా ఆడాలి. 

అతడు పోరాటానికి సిద్ధంగా ఉన్నాడు. శక్తి, బాగా ఆడాలనే సంకల్పం అతడిని ముందుకు నడిపిస్తాయి. రోహిత్ నా సోదరుడు.. గొప్ప సంకల్పం, పూర్తి ఎనర్జీతో ఆడాలని కోరుకుంటున్నాను" అని హేడన్‌ స్టార్‌ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
చదవండి: అదొక చెత్త క్రికెట్‌ బోర్డు.. అందుకే రాజీనామా: ఆసీస్‌ దిగ్గజం
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)