Breaking News

రోహిత్‌... పైపైకి!

Published on Thu, 03/13/2025 - 04:05

దుబాయ్‌: టీమిండియా కెప్టెన్‌ ఫైనల్లో చక్కటి ఇన్నింగ్స్‌తో భారత జట్టుకు మూడోసారి ట్రోఫీ దక్కడంలో కీలకపాత్ర పోషించిన రోహిత్‌ శర్మ తాజా ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తుదిపోరులో అర్ధశతకంతో ఆకట్టుకున్న రోహిత్‌ రెండు ర్యాంక్‌లు మెరుగు పర్చుకొని 756 రేటింగ్‌ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.

భారత యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌  (784 పాయింట్లు) ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... టాప్‌–10లో మొత్తం నలుగురు భారత ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. చాంపియన్స్‌ ట్రోఫీలో 218 పరుగులు చేసి ఆకట్టుకున్న స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (736 పాయింట్లు) ఒక స్థానం కోల్పోయి 5వ ర్యాంక్‌లో నిలవగా... మిడిలార్డర్‌లో కీలక ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్న శ్రేయస్‌ అయ్యర్‌ (704 పాయింట్లు) 8వ ర్యాంక్‌లో స్థిరంగా కొనసాగుతున్నాడు. 

న్యూజిలాండ్‌ ప్లేయర్‌ రచిన్‌ రవీంద్ర 14 స్థానాలు ఎగబాకి 14వ ర్యాంక్‌కు చేరగా... డారిల్‌ మిషెల్‌ ఒక స్థానం మెరుగు పర్చుకొని ఆరో ర్యాంక్‌లో నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో కుల్దీప్‌ యాదవ్‌ (650 పాయింట్లు) మూడు స్థానాలు ఎగబాకి భారత్‌ తరఫున అత్యుత్తమంగా మూడో ర్యాంక్‌లో నిలిచాడు. రవీంద్ర జడేజా (616 పాయింట్లు) కూడా మూడు స్థానాలు మెరుగు పరుచుకొని పదో ర్యాంక్‌కు చేరాడు. 

న్యూజిలాండ్‌ సారథి సాంట్నర్‌ (657 పాయింట్లు) రెండో ర్యాంక్‌కు చేరగా... శ్రీలంక ఆఫ్‌ స్పిన్నర్‌ తీక్షణ (680 పాయింట్లు) ‘టాప్‌’ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. వన్డే ఆల్‌రౌండర్ల జాబితాలో భారత్‌ నుంచి రవీంద్ర జడేజా (10వ ర్యాంక్‌) ఒక్కడే టాప్‌–10లో కొనసాగుతున్నాడు.  

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)