Breaking News

రోహిత్‌ శర్మకు ఫైన్‌ వేసిన పోలీసులు.. ఎందుకంటే?

Published on Wed, 10/18/2023 - 21:16

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు  పూణే ట్రాఫిక్  పోలీసులు ఊహించని షాకిచ్చారు. ముంబై – పూణే హైవేపై పరిమితికి మించిన వేగంతో  కారును నడిపినందుకు మూడు చలాన్లు విధించారు.  రిపోర్టుల ప్రకారం రోహిత్‌ శర్మ గంటకు 200 కి.మీ కంటే ఎక్కువ వేగంతో డ్రైవింగ్ చేసినట్లు తెలుస్తోంది.

పూణే మిర్రర్‌ నివేదిక ప్రకారం.. అతి వేగంగా వెళ్తున్న రోహిత్‌ కారును ఓ పోలీస్‌ ఉన్నతాధికారి అడ్డగించి, పోలీసు ఎస్కార్ట్‌తో జట్టు బస్సులో ప్రయాణించాలని సూచించారు. కాగా పాకిస్తాన్‌తో మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లకు 5 రోజుల బ్రేక్ లభించింది. పాక్‌ మ్యాచ్‌ అనంతరం హిట్‌మ్యాన్‌ అహ్మదాబాద్‌ నుంచి  హెలిక్యాప్టర్‌లో ముంబైకి చేరుకున్నాడు. 

అయితూ వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ఆక్టోబర్‌ 19(గురువారం) పుణే వేదికగా బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడనుంది.   ఈ క్రమంలో రెండు రోజుల పాటు కుటుబంతో కలిసి గడిపిన రోహిత్ శర్మ పూణేలో ఉన్న జట్టుతో  కలిసేందుకు రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నాడు. ముంబై నుంచి  తన లంబోర్గిని ఉరుస్ కారులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా రోహిత్‌ శర్మ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌.. 217 పరుగులు చేశాడు.
చదవండి: World Cup 2023: మిచెల్ శాంట్నర్‌ అద్బుతం.. క్యాచ్‌ ఆఫ్‌ది టోర్నమెంట్‌! వీడియో వైరల్‌

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)