Breaking News

రోహిత్‌కు విసుగుతెప్పించిన అభిమాని.. హిట్‌మ్యాన్‌ రియాక్షన్‌ వైరల్‌

Published on Mon, 12/02/2024 - 14:20

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ‘కోపమొచ్చింది’. తనను చుట్టుముట్టిన అభిమానుల్లో ఒకరు అత్యుత్సాహం ప్రదర్శించడంతో హిట్‌మ్యాన్‌ నవ్వుతూనే విసుక్కున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భారత క్రికెట్‌ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది.

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో ఐదు టెస్టులు  ఆడనుంది. అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలి టెస్టుకు దూరమయ్యాడు. తన భార్య రితికా సజ్దే తమ రెండో సంతానానికి జన్మనివ్వడంతో.. ఇండియాలోనే ఉండిపోయాడు. అయితే, భార్యకు ప్రసవమైన వెంటనే రోహిత్‌ శర్మ ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు.

పెర్త్‌ వేదికగా మొదటి టెస్టు మధ్యలోనే జట్టుతో చేరాడు. ఇక అడిలైడ్‌లో డిసెంబరు 6 నుంచి మొదలుకానున్న రెండో టెస్టు(పింక్‌ బాల్‌)తో రోహిత్‌ తిరిగి టీమిండియా పగ్గాలు చేపట్టనున్నాడు. అయితే, అంతకంటే ముందే గులాబీ బంతితో టీమిండియా సాధన చేసింది. కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌ మైదానంలో ఆస్ట్రేలియా ప్రైమ్‌ మినిస్టర్స్‌ ఎలెవన్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్ ఆడింది.

టీమిండియా విజయం
శనివారం మొదలుకావాల్సిన ఈ మ్యాచ్‌ వర్షం వల్ల తొలిరోజు టాస్‌ పడకుండానే ముగిసిపోయింది. దీంతో ఆదివారం ఆట కొనసాగగా 46 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది. ఇదిలా ఉంటే.. ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు వెళ్తున్న సమయంలో రోహిత్‌ శర్మను అభిమానులు చుట్టుముట్టారు.

హిట్‌మ్యాన్‌ రియాక్షన్‌ వైరల్‌
హిట్‌మ్యాన్‌తో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. అయితే, ఓ అభిమాని.. రోహిత్‌ వేరేవాళ్లకు ఆటోగ్రాఫ్‌ ఇస్తుండగా తనతో సెల్ఫీ దిగాలంటూ పదే పదే విసిగించాడు. దీంతో ఒకింత అసహనానికి గురైన రోహిత్‌.. ‘‘ఒకసారి ఒక్క పని మాత్రమే చేయగలం’’ అని సున్నితంగానే కౌంటర్‌ ఇచ్చాడు. ఇక ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రోహిత్‌ కేవలం మూడు పరుగులే చేసి అవుటయ్యాడు.

కాన్‌బెర్రాను వీడిన రోహిత్‌ సేన
రెండో టెస్టు కోసం టీమిండియా అడిలైడ్‌కు పయనమైంది. కాగా ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కోసం కాన్‌బెర్రాకు వచ్చిన రోహిత్‌ సేన తొలుత ఆసీస్‌ ప్రధాని ఆంథోని ఆల్బనీస్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం రోహిత్‌ ఆస్ట్రేలియన్‌ పార్లమెంటులో ప్రసంగించాడు. ఇక ఇప్పుడు పింక్‌ బాల్‌ టెస్టులో సారథిగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యాడు.

Videos

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

మహిళలపై TDP మూకలు ఎలా దాడి చేశారో చూడండి

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

ABN రాధాకృష్ణ... నీ ఫామ్ హౌస్ బాగోతం.. కారుమూరి సంచలన కామెంట్స్

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్