Breaking News

చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. తొలి భారత ఆటగాడిగా!

Published on Thu, 07/20/2023 - 21:35

ట్రినిడాడ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా అద్బుతంగా ఆడుతోంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్‌ శర్మ, యశస్వీ జైశ్వాల్‌ మరోసారి అద్బుతమైన ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ కలిసి 23 ఓవర్లు ముగిసే సరికి తొలి వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్‌ శర్మ(88 బంతుల్లో 61 నాటౌట్‌), యశస్వీ జైశ్వాల్‌(50) పరుగులతో క్రీజులో ఉన్నారు.

రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు.. 
తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో 2000 పరుగుల ​మార్క్‌ను అందుకున్న తొలి భారత ఆటగాడిగా రోహిత్‌ రికార్డులకెక్కాడు. 45 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద రోహిత్‌ ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు డబ్ల్యూటీసీలో 25 మ్యాచ్‌లు (40) ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్‌ 2017 పరుగులు చేశాడు.

రోహిత్‌ తర్వాత స్ధానంలో భారత్‌ నుంచి విరాట్‌ కోహ్లి(1942) ఉన్నాడు. కాగా ఇది వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ మూడో ఎడిషన్‌ ఉన్న విషయం తెలిసిందే. తొలి ఎడిషన్‌ విజేతగా న్యూజిలాండ్‌ నిలవగా.. రెండో ఎడిషన్‌లో ఆస్ట్రేలియా ఛాంపియన్‌గా నిలిచింది. 

విండీస్‌తో రెండో టెస్టుకు భారత జట్టు: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, జయదేవ్ ఉనద్కత్, ముఖేష్ కుమార్, మహ్మద్ సిరాజ్‌
చదవండి
: IND vs WI: ఒకప్పుడు పోలీస్‌ అవ్వాలనుకున్నాడు.. కట్‌ చేస్తే ఇప్పుడు టీమిండియా క్రికెటర్‌!

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)