Breaking News

'రోహిత్ అద్భుతమైన కెప్టెన్‌.. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగలడు'

Published on Fri, 05/31/2024 - 15:56

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024కు టీమిండియా అన్ని విధాల స‌న్న‌ద్ద‌మ‌వుతోంది. ఇప్ప‌టికే అమెరికాకు చేరుకున్న భార‌త జ‌ట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తోంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా త‌మ తొలి మ్యాచ్‌లో న్యూయార్క్ వేదిక‌గా ఐర్లాండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్ కంటే ముందు టీమిండియా శ‌నివారం(జూన్ 1న‌) బంగ్లాదేశ్‌తో వార్మాప్ మ్యాచ్ ఆడ‌నుంది.

ఈ క్ర‌మంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌పై బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ ష‌కీబ్ అల్ హ‌స‌న్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. రోహిత్ శ‌ర్మ ఒక అద్భుత‌మైన కెప్టెన్ అని,  ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించే స‌త్తా ఉంద‌ని ష‌కీబ్ కొనియాడాడు. 

"రోహిత్ శ‌ర్మ భార‌త జ‌ట్టును అద్భుతంగా న‌డిపిస్తున్నాడు. అత‌డి కెప్టెన్సీ స్కిల్స్ గురించి ఎంత చెప్పుకున్న త‌క్కువే. కెప్టెన్‌గా అతనికి అద్భుతమైన రికార్డు ఉంది. రోహిత్ జ‌ట్టులో ఆట‌గాళ్లంద‌రని స‌మానంగా చూస్తాడు. త‌న స‌హ‌చర ఆట‌గాళ్లు కూడా రోహిత్‌ను అంతే గౌర‌విస్తారు. రోహిత్ ఒక వ‌ర‌ల్డ్ క్లాస్ బ్యాట‌ర్‌. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించే స‌త్తా రోహిత్‌కు ఉందని" స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ష‌కీబ్ పేర్కొన్నాడు. 

ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కాగా రోహిత్‌కు  బంగ్లాదేశ్‌పై వన్డేలు, టీ20లు రెండింటిలోనూ అద్భుతమైన రికార్డు ఉంది. బంగ్లాపై 12 టీ20 ఇన్నింగ్స్‌ల‌లో 37.83 సగటుతో 454 పరుగులు చేశాడు. అదే విధంగా 17 వ‌న్డే ఇన్నింగ్స్‌లలో 56.14 సగటుతో 786 పరుగులు సాధించాడు. కాగా షకీబ్‌, రోహిత్‌ ఇద్దరే 2007 అరంగేట్ర టీ20 వరల్డ్‌కప్‌ నుంచి కొనసాగుతున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)