Breaking News

రోహిత్‌ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే?

Published on Sun, 03/09/2025 - 15:32

అంత‌ర్జాతీయ వ‌న్డేల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అత్యంత చెత్త రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు టాస్‌ ఓడిన కెప్టెన్‌గా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా రికార్డును స‌మం చేశాడు. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భార‌త్‌-న్యూజిలాండ్ ఫైన‌ల్ మ్యాచ్ సందర్భంగా రోహిత్ ఈ ఫీట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు.

రోహిత్ ఇప్పటివరకు వన్డేల్లో వరుసగా 12 సార్లు టాస్ ఓడిపోయాడు. బ్రియాన్ లారా కూడా వరుసగా 12 సార్లు టాస్‌ ఓడిపోయాడు. ఇక ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ ఫైనల్‌​ మ్యాచ్‌కు కివీస్ స్టార్ పేసర్ మాట్ హెన్రీ గాయం కారణంగా దూరమయ్యాడు.

ఆజేయంగా భారత్‌..
ఇక ఈ టోర్నీలో టీమిండియా ఆజేయంగా ఫైనల్‌కు చేరింది. లీగ్‌ స్టేజిలో మూడుకు మూడు మ్యాచ్‌లు గెలిచిన భారత్‌.. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై అద్బుతమైన విజయం సాధించింది. ఫైనల్లో కూడా కివీస్‌ను ఓడించి మూడో ఛాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ను తమ ఖాతాలో వేసు​కోవాలని భారత్‌ భావిస్తోంది. అయితే ఐసీసీ టోర్నీల్లో ఇప్పటివరకు ఫైనల్లో ఒక్కసారి కివీస్‌పై భారత్‌ గెలవలేదు. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ-2000, వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో భారత్‌​ ఓటమి చవిచూసింది.

వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు టాస్‌ ఓడిపోయిన కెప్టెన్లు
👉బ్రియన్‌ లారా- వెస్టిండీస్‌ మాజీ సారథి- అక్టోబరు 1998- మే 1999 వరకు- 12 సార్లు 
👉రోహిత్‌ శర్మ- ఇండియా కెప్టెన్‌- నవంబరు 2023- మార్చి 2025*-12 సార్లు 
👉పీటర్‌ బారెన్‌- నెదర్లాండ్స్‌ మాజీ కెప్టెన్‌- మార్చి 2011 నుంచి ఆగష్టు 2013-11 సార్లు

ఫైనల్‌ మ్యాచ్‌కు తుది జ‌ట్లు
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీప‌ర్‌), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), కైల్ జామిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్

భార‌త్‌ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్‌ రాహుల్(వికెట్ కీప‌ర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
చదవండి: Champions Trophy: ఫైన‌ల్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్‌..

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు