Breaking News

చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వరల్డ్ రికార్డు బ్రేక్‌

Published on Sun, 06/14/2026 - 09:59

ధర్మశాల వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను దురదృష్టం వెంటాడింది. 16 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించిన రోహిత్‌.. అనుహ్యంగా రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. కాగా హిట్‌మ్యాన్ క్రీజులో ఉన్నది కాసేపే అయినా పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

రోహిత్ సాధించిన రికార్డులు ఇవే
👉అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్లలో కలిపి) ఓపెనర్‌గా 16,000 పరుగుల మైలురాయిని రోహిత్ శర్మ అందుకున్నాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ ఈ ఫీట్ నమోదు చేశాడు. అతడు ఈ రికార్డును కేవలం 384 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించాడు. దీంతో అత్యంతవేగంగా ఈ ఫీట్‌ను అందుకున్న ఓపెనర్‌గా ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్(390) రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు.

👉ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్ చరిత్రలో 16,000 పరుగుల మైలు రాయిని అందుకున్న 7వ ఓపెనర్‌గా రోహిత్ నిలిచాడు.

👉అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌ను అధిగమించడానికి రోహిత్ శర్మ ఇప్పుడు కేవలం 110 పరుగుల దూరంలో ఉన్నాడు. సెహ్వాగ్ త‌న కెరీర్‌లో ఓపెనర్‌గా మొత్తం 16,119 పరుగులు చేశాడు.

👉ఈ మ్యాచ్ బరిలోకి దిగడం ద్వారా రోహిత్ శర్మ.. భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక వయసులో వన్డే మ్యాచ్ ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 

ఇంతకుముందు ఈ రికార్డు  మోహిందర్ అమర్‌నాథ్ పేరిట ఉండేది. ఆయన 39 ఏళ్ల 36 రోజుల వయసులో 1989లో తన చివరి వన్డే ఆడారు. ఇప్పుడు 39 సంవత్సరాల 44 రోజుల వయస్సు కలిగిన హిట్‌మ్యాన్‌.. అమర్‌నాథ్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.
చదవండి: FIFA World Cup: ఆఖరి క్షణంలో అద్భుతం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర
 

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు