Breaking News

చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

Published on Wed, 06/17/2026 - 15:22

ల‌క్నో వేదిక‌గా అఫ్గానిస్తాన్‌తో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో టీమిండియా స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. య‌శ‌స్వి జైశ్వాల్‌తో క‌లిసి భార‌త ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రోహిత్‌.. అఫ్గాన్ బౌల‌ర్ల‌పై బౌండ‌రీల‌తో విరుచుకుపడ్డాడు. హిట్ మ్యాన్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48 పరుగులు చేశాడు.

రోహిత్ ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో 14,000 లిస్ట్-ఎ పరుగులను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన ఐదో భార‌త క్రికెట‌ర్‌గా రోహిత్ నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ కంటే ముందు దిగ్గజ క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లి, సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌ ఉన్నారు.

అదేవిధంగా లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యంత వేగంగా 14,000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు సచిన్‌(348 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది. హిట్‌మ్యాన్‌ 345 ఇన్నింగ్స్‌లలో అందుకుని సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. ఇక ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో కోహ్లి(290) అగ్రస్ధానంలో ఉన్నాడు.

లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు:

సచిన్ టెండూల్కర్: 21,999 పరుగులు

విరాట్ కోహ్లీ: 16,447 పరుగులు

సౌరవ్ గంగూలీ: 15,622 పరుగులు

రాహుల్ ద్రావిడ్: 15,271 పరుగులు

రోహిత్ శర్మ: 14,007+ పరుగులు

అత్యంత వేగంగా 14,000 లిస్ట్-ఎ పరుగులు చేసిన భారత ప్లేయర్లు
విరాట్ కోహ్లి-290
రోహిత్ శర్మ-345
సచిన్ టెండూల్కర్- 348
చదవండి: రాక రాక వచ్చిన అవకాశం.. జైస్వాల్‌ అట్టర్‌ ఫ్లాప్‌

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు