Breaking News

MI Vs GT: ఏంటి హార్దిక్ ఇది.. రోహిత్‌కు ఇచ్చే గౌర‌వం ఇదేనా? వీడియో వైర‌ల్‌

Published on Sun, 03/24/2024 - 22:26

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ముంబై సారధిగా హార్దిక్ పాండ్యా బరిలోకి దిగాడు. హార్దిక్‌కు కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఘోర అవమానం ఎదురైంది.

టాస్ సందర్భంగా హార్దిక్ మైదానంలో వచ్చినప్పుడు అభిమానులు రోహిత్ రోహిత్ అంటూ ఎగతాళి చేశారు. కాగా ఐపీఎల్‌-2024 సీజ‌న్ వేలానికి ముందు రోహిత్‌ స్థానంలో  హార్దిక్‌ పాండ్యాను జట్టు కెప్టెన్‌గాముంబై ఇండియ‌న్స్‌ నియమించిన సంగ‌తి తెలిసిందే. హార్దిక్‌ను గుజ‌రాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మ‌రి త‌మ జ‌ట్టు ప‌గ్గాల‌ను ముంబై అప్ప‌గించింది.

ముంబై తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని హిట్‌మ్యాన్ అభిమానులు ఇప్ప‌టికి జీర్ణించుకోలేక‌పోతున్నారు. గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ సాధార‌ణ ఆట‌గాడిగా బ‌రిలోకి దిగడాన్ని అభిమానులు త‌ట్టుకోలేక‌పోతున్నారు.

ఇక ఇది ఇలా ఉండ‌గా.. ఈ మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ‌తో హార్దిక్ ఆట‌లు ఆడుకున్నాడు. ప‌దేప‌దే రోహిత్ శ‌ర్మ ఫీల్డింగ్ పొజిషన్‌ను హార్దిక్ మారుస్తూ అభిమానుల అగ్ర‌హానికి గురయ్యాడు. సాధ‌ర‌ణంగా 30 యార్డ్ స‌ర్కిల్‌లో ఉండే రోహిత్ ఈ మ్యాచ్‌లో బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తూ క‌న్పించాడు.

గుజ‌రాత్ ఇన్నింగ్స్ ఆఖరి  ఓవ‌ర్ వేసిన గెరాల్డ్ కోయెట్జీ బౌలింగ్‌లో రోహిత్‌ను తొలుత మిడాన్‌లో ఫీల్డింగ్‌లో చేయ‌మ‌ని హార్దిక్ ఆదేశించాడు. అయితే బౌల‌ర్‌తో మాట్లాడిన హార్దిక్ వెంట‌నే రోహిత్‌ను మ‌ళ్లీ లాంగ్-ఆన్ పొజిషన్‌కు వెళ్ల‌మ‌ని సూచించాడు.

హార్దిక్ ఆర్డ‌ర్స్ ఇవ్వ‌డంతో రోహిత్ ప‌రిగెత్తుకుంటూ లాంగ్ ఆన్‌కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇది చూసిన నెటిజ‌న్లు హార్దిక్ కావాల‌నే రోహిత్ ఫీల్డింగ్‌ను పొజిషన్‌ను మార్చాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)