Breaking News

భార‌త తుది జ‌ట్టులో వారిద్ద‌రికి నో ఛాన్స్‌.. హింట్ ఇచ్చిన రోహిత్‌

Published on Tue, 09/17/2024 - 15:41

సెప్టెంబ‌ర్ 19 నుంచి చెన్నై వేదిక‌గా ప్రారంభం కానున్న తొలి టెస్టులో భార‌త్‌-బంగ్లాదేశ్ జట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను శుభారంభం చేయాల‌ని ఇరు జ‌ట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఇరు జ‌ట్లు త‌మ ఆస్త్ర‌శాస్త్రాల‌ను సిద్దం చేసుకున్నాయి. ఇప్పటికే చెన్నైకు చేరుకున్న టీమిండియా, బంగ్లా జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాయి.

వారిద్ద‌రికి నో ఛాన్స్‌..
ఇక బంగ్లాతో తొలి టెస్టుకు భార‌త తుది జ‌ట్టులో యువ ఆట‌గాళ్లు ధ్రువ్ జురెల్‌, స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌ల‌కు చోటు ద‌క్కే సూచ‌నలు క‌న్పించ‌డం లేదు. కేఎల్ రాహుల్‌, రిష‌బ్ పంత్ తిరిగి జ‌ట్టులోకి రావ‌డంతో వీరిద్ద‌రూ బెంచ్‌కే ప‌రిమితం కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

తాజాగా ప్రీ మ్యాచ్ కాన్ఫ‌రెన్స్‌లో కెప్టెన్‌ రోహిత్ శ‌ర్మ చేసిన వ్యాఖ్య‌లు ఈవార్త‌ల‌కు మ‌రింత ఊత‌మిస్తున్నాయి.  మా ఆఖ‌రి టెస్టు సిరీస్ ఇంగ్లండ్‌తో ఆడిన‌ప్పుడు చాలా మంది సీనియ‌ర్ ఆట‌గాళ్లు గాయం కార‌ణంగా దూరంగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే కొత్త ఆట‌గాళ్ల‌కు జ‌ట్టులో చోటు ల‌భించింది.

బహుశా ఇప్పుడు కొంత‌మంది యువ ఆట‌గాళ్ల‌కు ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో చోటు ద‌క్క‌క‌పోవ‌చ్చు. కానీ క‌చ్చితంగా వారికి ముందుముందు అవకాశాలు ల‌భిస్తాయి అని రోహిత్ పేర్కొన్నాడు. దీంతో జురెల్‌, స‌ర్ఫరాజ్‌ల‌కు దాదాపుగా ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో చోటు లేనిట్లే. 

కాగా వీరిద్ద‌రూ త‌మ అరంగేట్ర సిరీస్‌లో అద‌ర‌గొట్టారు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో జురెల్‌, స‌ర్ఫారాజ్ అద్భుత‌మైన ప్ర‌దర్శ‌న క‌న‌బ‌రిచారు. కానీ సీనియర్ ఆట‌గాళ్లు అంద‌రూ ఇప్పుడు  అందుబాటులో ఉండ‌డంతో వీరిద్దరూ తుది జట్టులో చోటు కోసం వేచి చూడక తప్పదు.
చదవండి: వారు ముగ్గురు ఒక అద్బుతం.. కొంచెం కూడా భయం లేదు: రోహిత్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)