Breaking News

చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. వరల్డ్‌కప్‌లో తొలి క్రికెటర్‌గా

Published on Sun, 10/15/2023 - 08:57

వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆఫ్గానిస్తాన్‌పై సెంచరీతో చెలరేగిన రోహిత్‌.. ఇప్పుడు పాకిస్తాన్‌పై మరో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. హిట్‌మ్యాన్‌ 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 86 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే పాక్‌ బౌలర్లను రోహిత్‌ ఊచకోత కోశాడు. తృటిలో మరో సెంచరీ చేసే అవకాశాన్ని రోహిత్‌ కోల్పోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన హిట్‌మ్యాన్‌ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

రోహిత్‌ సాధించిన రికార్డులు ఇవే..
►వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో విజయవంతమైన రన్‌ ఛేజింగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్‌ నిలిచాడు. రోహిత్‌ శర్మ ఇప్పటివరకు వరల్డ్‌కప్‌లో 9 విజయవంతమైన లక్ష్య ఛేదనలో 586 పరుగులు చేశాడు. కాగా అంతకుముందు ఈ రికార్డు ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌(519) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో పాంటింగ్‌ రికార్డును రోహిత్‌ బ్రేక్‌ చేశాడు.

►అదే విధంగా ఈ మ్యాచ్‌లో 6 సిక్స్‌లతో చెలరేగిన హిట్‌మ్యాన్‌.. వన్డే క్రికెట్‌లో 300 సిక్స్‌ల మైలు రాయిని అందుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ వన్డేల్లో 300 సిక్స్‌ల మార్క్‌ను అందుకున్న  మూడో క్రికెటర్‌గా రోహిత్‌ రికార్డులకెక్కాడు.

ఈ జాబితాలో పాకిస్తాన్‌ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది(351) తొలి స్ధానంలో ఉండగా.. తర్వాతి స్ధానాల్లో క్రిస్‌ గేల్‌(331), రోహిత్‌(303) ఉన్నారు. అదే విధంగా ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌ రోహిత్‌ శర్మ కావడం విశేషం.
► అంతేకాకుండా అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 300 సిక్స్‌ల మైలు రాయిని అందుకున్న మొదటి క్రికెటర్‌గా రోహిత్‌ చరిత్ర సృష్టించాడు.

►వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీలో పాకిస్తాన్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన భారత కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ రికార్డులకెక్కాడు. రోహిత్‌ ఈ మ్యాచ్‌లో 86 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)