Breaking News

రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు.. సచిన్‌, ధోనిల సరసన

Published on Sun, 10/19/2025 - 13:43

టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) అరుదైన ఘ‌న‌త సాధించాడు.  అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 500 మ్యాచ్‌ల మైలు రాయిని అందుకున్నాడు. ఆదివారం పెర్త్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో తొలి వ‌న్డే సంద‌ర్భంగా రోహిత్ ఈ ఫీట్‌ను న‌మోదు చేశాడు. ఈ ఫీట్ అందుకున్న ఐదో భార‌త క్రికెట‌ర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు.

ఈ జాబితాలో దిగ్గ‌జ క్రికెట‌ర్లు స‌చిన్ టెండూల్క‌ర్‌, విరాట్ కోహ్లి, రాహుల్ ద్ర‌విడ్‌, ఎంఎస్ ధోని లు ఉన్నారు. 38 ఏళ్ల రోహిత్ భార‌త తరపున ఇప్ప‌టివ‌ర‌కు 274 వ‌న్డేలు,  67 టెస్టులు,159 టీ20లు ఆడాడు. గ‌త ఏడాది జూన్‌లో టీ20ల‌కు వీడ్కోలు ప‌లికిన రోహిత్‌.. నాలుగు నెల‌ల కింద టెస్టుల నుంచి త‌ప్పుకొన్నాడు. 

ఈ ముంబైక‌ర్ ప్ర‌స్తుతం కేవ‌లం వ‌న్డేల్లో మాత్ర‌మే కొన‌సాగుతున్నాడు. రోహిత్ శ‌ర్మ త‌న అంతర్జాతీయ కెరీర్‌లో 19,708 ప‌రుగులు చేశాడు. అత‌డి అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు 264(వ‌న్డేల్లో)గా ఉంది. అయితే  ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025 విజ‌యం త‌ర్వాత రోహిత్  భార‌త్ త‌ర‌పున ఆడుతున్న తొలి మ్యాచ్ ఇది. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. కేవ‌లం 8 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు.

500 పైగా అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ప్లేయ‌ర్స్ వీరే
👉 సచిన్ టెండూల్క‌ర్ – 664 మ్యాచ్‌లు
👉విరాట్ కోహ్లి – 551 మ్యాచ్‌లు
👉ఎంఎస్ ధోని – 535 మ్యాచ్‌లు
👉 రాహుల్ ద్ర‌విడ్ – 504 మ్యాచ్‌లు
👉రోహిత్ శ‌ర్మ – 500 మ్యాచ్‌లు
చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన నితీశ్ కుమార్ రెడ్డి.. 93 ఏళ్లలో ఒకే ఒక్కడు
 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)