Breaking News

చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. తొలి భారత ఆటగాడిగా! సచిన్‌ రికార్డు బద్దలు

Published on Tue, 09/05/2023 - 08:07

ఆసియాకప్‌-2023లో టీమిండియా సూపర్‌-4లో అడుగుపెట్టింది. సోమవారం క్యాండీ వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నేపాల్‌ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్‌ అయింది. 

భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, సిరాజ్‌ తలా మూడు వికెట్లు సాధించగా.. షమీ, హార్దిక్‌ పాండ్యా, శార్దుల్‌ ఠాకూర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. నేపాల్‌ బ్యాటర్లలో ఆసిఫ్‌ షేక్‌(58) అర్ధ సెంచరీ సాధించగా.. సోంపాల్‌ కామి(48), కుశాల్‌ భుర్తేల్‌(38) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. 

అనంతరం వర్షం కారణంగా డకవర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం భారత్‌ లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145 పరుగులుగా నిర్దేశించారు. భారత్‌ 20.1 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 147 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (74) శుబ్‌మన్‌ గిల్‌(67) ఆజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇక భారత్‌ సూపర్‌-4 దశకు చేరడంతో సెప్టెంబర్‌ 10న పాకిస్తాన్‌తో మరోసారి తలపడనుంది.  

రోహిత్‌ శర్మ అరుదైన ఘనతలు..
ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు.ఆసియాకప్‌ టోర్నీలో అత్యధిక సార్లు ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్‌లు కొట్టిన భారత ఆటగాడిగా రోహిత్‌ రికార్డులకెక్కాడు. రోహిత్‌ ఇప్పటివరకు ఆసియాకప్‌లో 10 సార్లు ఏభై పైగా  స్కోర్లు సాధించాడు.

ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌(9) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సచిన్‌ రికార్డును రోహిత్‌ బ్రేక్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ తన 250వ సిక్స్‌ మైలు రాయిని అందుకున్నాడు. తద్వారా వన్డేల్లో ఈ ఘనత సాధించిన మొదటి భారత ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో హిట్‌మ్యాన్‌ మూడో స్ధానంలో నిలిచాడు.
చదవండి: Asia Cup 2023: నేపాల్‌ చిత్తు.. సూపర్‌-4కు భారత్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)