Breaking News

చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. 112 ఏళ్ల తర్వాత! ప్రపంచంలోనే

Published on Sat, 03/09/2024 - 15:03

ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులోనూ ఇంగ్లండ్‌ను టీమిండియా చిత్తు చేసింది. ఇన్నింగ్స్‌ 64 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. తొలి టెస్టులో ఓటమి పాలైన భారత్‌.. తిరిగి పుంజుకుని వరుసగా నాలుగు టెస్టుల్లోనూ విజయ భేరి మ్రోగించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను 4-1తో భారత్‌ కైవసం చేసుకుంది. కాగా ఆఖరి టెస్టులో 473/8తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్  మరో 4 పరుగులు మాత్రమే చేసి 477 పరుగులకు ఆలౌటైంది.

భారత బ్యాటర్లలో రోహిత్‌ శర్మ(103), గిల్‌(110) సెంచరీలతో చెలరేగగా.. పడిక్కల్‌(65), సర్ఫరాజ్‌ ఖాన్‌(56) హాఫ్‌ సెంచరీలతో మెరిశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో షోయబ్‌ బషీర్‌ 5 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 48.1 ఓవర్లలోనే 195 పరుగులకు కుప్పకూలింది. 100వ టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లతో ఇంగ్లిష్ జట్టు పతనాన్ని శాసించాడు. అతడితో పాటు కుల్దీప్‌, బుమ్రా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే ఆలౌటైంది.

రోహిత్‌ శర్మ అరుదైన ఘనత..
ఇక ఈ విజయంతో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 112 ఏళ్ల తర్వాత ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడి 4-1‌తో సిరీస్ కైవసం చేసుకున్న కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైన రోహిత్‌ సేన.. తర్వాత నాలుగు మ్యాచ్‌ల్లో పర్యాటక జట్టును చిత్తు చేసింది. కాగా సొంతగడ్డపై భారత్‌కు ఇది 400వ విజయం కావడం గమనార్హం​.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)