Breaking News

ఆల్‌టైమ్‌ రికార్డుకు ఏడు సిక్సర్ల దూరంలో ఉన్న రోహిత్‌

Published on Tue, 09/03/2024 - 21:26

టెస్ట్‌ల్లో భారత్‌ తరఫున అత్యధిక సిక్సర్ల రికార్డు సాధించేందుకు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కేవలం ఏడు సిక్సర్లు దూరంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్‌ త్వరలో బంగ్లాదేశ్‌తో జరుగబోయే సిరీస్‌లో మరో ఏడు సిక్సర్లు బాదితే టీమిండియా తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వీరేందర్‌ సెహ్వాగ్‌ రికార్డును అధిగమిస్తాడు. 

వీరూ 103 టెస్ట్‌ల్లో 90 సిక్సర్లు బాదగా.. ప్రస్తుతం రోహిత్‌ ఖాతాలో 84 సిక్సర్లు (59 టెస్ట్‌ల్లో) ఉన్నాయి. టెస్ట్‌ల్లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో వీరూ, రోహిత్‌ తర్వాత ధోని (78), సచిన్‌ (69), రవీంద్ర జడేజా (64) టాప్‌-5లో ఉన్నారు. సుదీర్ఘ ఫార్మాట్‌లో టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి కేవలం 26 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. 

మూడు ఫార్మాట్ల విషయానికొస్తే.. రోహిత్‌ ప్రపంచంలోనే అందరి కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఉన్నాడు. హిట్‌మ్యాన్‌ తన కెరీర్‌లో 483 మ్యాచ్‌లు ఆడి 620 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో రోహిత్‌ తర్వాతి స్థానాల్లో క్రిస్‌ గేల్‌ (553), షాహిద్‌ అఫ్రిది (476) టాప్‌-3లో ఉన్నారు.

బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌ విషయానికొస్తే.. రెండు టెస్ట్‌లు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్‌ జట్టు ఈ నెల 19 నుంచి భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ జరుగనుంది. తొలి టెస్ట్‌ సెప్టెంబర్‌ 19, రెండో టెస్ట్‌ సెప్టెంబర్‌ 27 నుంచి ప్రారంభమవుతాయి. టీ20 సిరీస్‌ అక్టోబర్‌ 6, 9, 12 తేదీల్లో జరుగుతుంది.

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)