Breaking News

నేపాల్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫైనల్లో సంచలనం

Published on Sat, 12/13/2025 - 22:48

నేపాల్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2025 ఫైనల్లో సంచలనం నమోదైంది. సుదుర్‌ పశ్చిమ్‌ రాయల్స్‌తో ఇవాళ (డిసెంబర్‌ 13) జరిగిన తుది పోరులో లుంబిని లయన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో లయన్స్‌ రాయల్స్‌ను చిత్తు చేసి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కిరీటీపూర్‌ వేదికగా జరిగిన ఫైనల్లో  సుదుర్‌ పశ్చిమ్‌ రాయల్స్‌, లుంబిని లయన్స్‌ పోటీపడ్డాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్స్‌.. రోహిత్‌ పౌడెల్‌ హ్యాట్రిక్‌ సహా ట్రంపెల్మన్‌ (2.1-0-3-3), షేర్‌ మల్లా (4-0-18-3), తిలక్‌ భండారి (4-0-26-1) చెలరేగడంతో 19.1 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌటైంది.

రోహిత్‌ ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌లో చివరి మూడు బంతులకు దీపేంద్ర సింగ్‌, దీపక్‌ బొహారా, పూనీత్‌ మెహ్రా వికెట్లు తీసి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ ఇషాన్‌ పాండే (33) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్‌ చేశాడు. మిగతా వారిలో దీపేంద్ర సింగ్‌ (13), హర్మీత్‌ సింగ్‌ (10), కుగ్గెలిన్‌ (10) మాత్రమే రెండ​ంకెల స్కోర్లు చేశారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని లయన్స్‌ ఆడుతూపాడుతూ ఛేదించింది. ఓపెనర్‌ దినేశ్‌ అధికారి (42) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి లయన్స్‌ గెలుపును ఆదిలోనే ఖరారు చేశాడు. డి ఆర్కీ షార్ట్‌ 14, నిరోషన్‌ డిక్వెల్లా 11, రోహిత్‌ పౌడెల్‌ 16 పరుగులు చేసి లయన్స్‌ గెలుపుతో భాగమయ్యారు. 

రాయల్స్‌ బౌలర్లలో హేమంత్‌ ధామి 2 వికెట్లు పడగొట్టగా.. దీపేంద్ర ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు తీయడంతో పాటు టోర్నీ ఆధ్యాంతం రాణించిన రూబెన్‌ ట్రంపెల్మన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌, టోర్నీ అవార్డులు లభించాయి.  

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)