Breaking News

వికెట్లు తీసేవాడేమో.. తప్పు చేశాడని బౌలింగ్‌ ఇ‍వ్వకుంటే ఎలా?

Published on Tue, 04/25/2023 - 22:21

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ భారీ స్కోరు చేసింది. 15 ఓవర్ల వరకు  130/4తో సాధారణంగా ఉన్న గుజరాత్‌ స్కోరు 20 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగులకు చేరుకుంది. అంటే చివరి ఐదు ఓవర్లలో గుజరాత్‌ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 97 పరుగులు చేసింది.  మిల్లర్‌, అభినవ్‌ మనోహర్‌లకు తోడుగా రాహుల్‌ తెవాటియా చివర్లో విధ్వంసం సృష్టించడంతో గుజరాత్‌ 200 మార్కు దాటింది. 

అయితే గ్రీన్‌ వేసిన 18వ ఓవర్‌ ముంబైకి కలిసి రాలేదు. ఆ ఓవర్‌లో అభినవ్‌ మనోహర్‌ రెండు సిక్సర్లు కొట్టగా.. మిల్లర్‌ ఒక సిక్సర్‌ కొట్టడంతో మొత్తంగా ఓవర్‌లో 22 పరుగులు వచ్చాయి.  ఆ తర్వాత మెరిడిత్‌ బౌలింగ్‌లోనూ మూడు సిక్సర్లు వచ్చాయి. ఆ తర్వాత చివరి ఓవర్లో తెవాటియా మరో రెండు సిక్సర్లు బాదాడు. 

అర్జున్‌ను నమ్మని రోహిత్‌
అయితే వాస్తవానికి అర్జున్‌ టెండూల్కర్‌ ఈ మ్యాచ్‌లో మంచి బౌలింగ్‌ కనబరిచాడు. రెండు ఓవర్లు వేసిన అతను 9 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీశాడు. అయితే పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో అర్జున్ ఒకే ఓవర్లో 31 పరుగులు సమర్పించుకొని ముంబై కొంప ముంచాడు.

ఈ మ్యాచ్‌లో కూడా మరోసారి అలాగే వేస్తే ఏం చేయలేమని రోహిత్‌ భావించి ఉంటాడు. కానీ గుజరాత్‌తో మ్యాచ్‌లో అర్జున్‌ బౌలింగ్‌ కాస్త బెటర్‌ అనిపించింది. ఆ 18వ ఓవర్‌ కామెరాన్‌ గ్రీన్‌తో కాకుండా అర్జున్‌తో వేయించి ఉంటే బాగుండేదని.. వికెట్లు తీసేవాడేమోనని  పలువురు అభిమానులు అభిప్రాయపడ్డారు.

చదవండి: 'అర్జున్‌ను తిడుతున్నావా? చావ్లా విషయంలో నువ్వు చేసిందేంటి!'

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)