ట్రోఫీ గెలిచే అర్హత అతడికే ఉంది: షోయబ్‌ అక్తర్‌

Published on Tue, 06/25/2024 - 19:54

టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా విజయపరంపర కొనసాగుతోంది. లీగ్‌, సూపర్‌-8 దశలో ఓటమన్నదే ఎరుగక రోహిత్‌ సేన సెమీ ఫైనల్‌ చేరుకుంది. కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో ఫైనల్‌లో అడుగుపెట్టేందుకు.. ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

సెయింట్‌ లూసియా వేదికగా గురువారం(జూన్‌ 27) ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023లోనే రోహిత్‌ ట్రోఫీ గెలవాల్సిందని.. ఈసారి కూడా టీమిండియాకే గెలిచే అర్హత ఉందని పేర్కొన్నాడు.

‘‘ఇండియా అద్భుతంగా ఆడింది. ఇది మీ వరల్డ్‌కప్‌. ఈసారి మీరు కచ్చితంగా గెలవాలి. ఉపఖండంలోనే ప్రపంచకప్‌ ట్రోఫీ ఉండాలి.

ఇటీవలే మంచి ఛాన్స్‌ మిస్‌ అయ్యారు. ఈసారి మాత్రం వందకు వంద శాతం మీకే టైటిల్‌ గెలిచే అర్హత ఉంది. నా పూర్తి మద్దతు మీకే. రోహిత్‌ వ్యూహాలు బాగున్నాయి. ట్రోఫీ గెలిచేందుకు అతడు అర్హుడు.

వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన టీమిండియా సారి బదులు తీర్చుకుంది. డిప్రెషన్‌ నుంచి బయటపడి ప్రత్యర్థిని సరైన సమయంలో దెబ్బకొట్టింది’’ అని షోయబ్‌ అక్తర్‌ భారత క్రికెట్‌ జట్టును ఆకాశానికెత్తాడు.

కాగా సూపర్‌-8లో భాగంగా ఆస్ట్రేలియాతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 24 పరుగుల తేడాతో గెలిచింది. రోహిత్‌ శర్మ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌(41 బంతుల్లో 92)తో జట్టుకు విజయం అందించాడు.

మరోవైపు.. దాయాది పాకిస్తాన్‌ మాత్రం గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. గ్రూప్‌-ఏలో అమెరికా, టీమిండియా చేతిలో ఓడిపోయి.. సూపర్‌-8 చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో బాబర్‌ ఆజం బృందంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)