Breaking News

Rohit-Gayle: జెర్సీలపై 45.. వారికి నచ్చేది మాత్రం 6..!

Published on Thu, 10/12/2023 - 12:39

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో మెరుపు శతకంతో (84 బంతుల్లో 131; 16 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించిన రోహిత్‌ శర్మ, టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ శతకంతో హిట్‌మ్యాన్‌ పలు ప్రపంచ రికార్డులు బద్దలుకొట్టాడు. ఇందులో అత్యధిక సిక్సర్ల రికార్డు ముఖ్యమైనది. విండీస్‌ విధ్వంసకర వీరుడు క్రిస్‌ గేల్‌ పేరిట ఉన్న ఈ రికార్డును రోహిత్‌ నిన్నటి మ్యాచ్‌లో అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో కలిపి గేల్‌ 553 సిక్సర్లు సాధించగా.. రోహిత్‌ ఆఫ్ఘన్‌తో మ్యాచ్‌లో ఈ సంఖ్యను అధిగమించాడు. ప్రస్తుతం రోహిత్‌ ఖాతాలో 556 సిక్సర్లు ఉన్నాయి. 

హిట్‌మ్యాన్‌ తన రికార్డును బద్దలుకొట్టిన నేపథ్యంలో గేల్‌ అతనికి శుభాకాంక్షలు తెలిపాడు. ఇందుకు రోహిత్‌ థ్యాంక్స్‌ చెబుతూ.. 4, 5 మన జెర్సీలపై ఉండే సంఖ్యలు.. మన ఫేవరెట్‌ మాత్రం 6 అంటూ తన సోషల్‌మీడియా ఖాతాలో రాసుకొచ్చాడు. ఈ ఇద్దరు సిక్సర్ల వీరుల మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఇది చూసి వారి అభిమానులు మురిసిపోతున్నారు. కాగా, రోహిత్‌, క్రిస్‌ గేల్‌లు 45 సంఖ్య జెర్సీలు ధరిస్తారన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో టీమిండియా.. ఆఫ్ఘనిస్తాన్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌.. హష్మతుల్లా షాహిది (80), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌(62) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌.. ఆడుతూపాడుతూ 35 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్‌ సెంచరీతో కదంతొక్కగా.. కోహ్లి (55 నాటౌట్‌), ఇషాన్‌ కిషన్‌ (47), శ్రేయస్‌ అయ్యర్‌ (25 నాటౌట్‌) రాణించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)