Breaking News

'బోపన్న.. మీ భార్య చాలా అందంగా ఉంది'

Published on Sun, 01/29/2023 - 13:04

ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో భారత్‌కు చెందిన టెన్నిస్ ప్లేయర్లు రోహన్ బోపన్న, సానియా మీర్జా ఓడిపోయిన సంగతి తెలిసిందే. రాడ్ లావర్ ఎరీనాలో బ్రెజిల్‌కు చెందిన రాఫెల్ మాటోస్, లూయిసా స్టెఫానీ జోడీ బోపన్న-సానియా జోడీని వరుస సెట్లలో 6-7, 2-6తో ఓడించింది. ఈ గేమ్‌తో సానియా మీర్జా గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌  ముగిసింది. ఇదిలా ఉంటే.. సానియా మీర్జా చివరి గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌ చూడడం కోసం ఆమె ఫ్యామిలీతో పాటు బోపన్న ఫ్యామిలీ కూడా హాజరయ్యారు.

మ్యాచ్‌లో బోపన్న భార్య సుప్రియ అన్నయ్య స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. బ్లాక్‌ డ్రెస్‌లో సుప్రియ హాట్‌ లుక్స్‌తో అదరగొట్టింది. అంతేకాదు మ్యాచ్‌ సమయంలో తన భర్త బోపన్న-సానియా జోడిని ఎంకరేజ్‌ చేస్తూ నిలబడి చప్పట్లు కొట్టడం కనిపించింది. బోపన్న భార్యను చూసిన ఒక వ్యక్తి ట్విటర్‌ వేదికగా ఆమె అందాన్ని పొగడకుండా ఉండలేకపోయాడు.

''బోపన్న మీ భార్య చాలా అందంగా ఉంది.. ప్రపంచంలో అంతటి అందమైన మహిళను ఎప్పుడూ చూడలేదు.'' అంటూ ట్వీట్ చేశాడు.  సదరు వ్యక్తి చేసిన ట్వీట్ సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది. కాగా ట్వీట్‌పై బోపన్న స్పందించాడు. ''మీరు చెప్పిన విషయాన్ని నేను అంగీకరిస్తున్నా'' అంటూ లవ్‌ ఎమోజీ సింబల్‌ జత చేశాడు.కాగా బోపన్న, సుప్రియ అన్నయ్యల వివాహం 2012లో జరిగింది. 

చదవండి: వరల్డ్‌కప్‌ ఫైనల్‌.. బిడ్డ ఆట చూడడం కోసం ఇన్వర్టర్‌ కొన్న తల్లి కథ

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)