చరిత్ర సృష్టించిన ఆండ్రూ ఫ్లింటాఫ్ తనయుడు.. తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా

Published on Fri, 07/19/2024 - 14:29

శ్రీలంక అండ‌ర్‌-19 జ‌ట్టుతో జ‌రుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ అండర్‌-19 క్రికెటర్‌, ఇంగ్లండ్ దిగ్గజం ఆండ్రూ ఫ్లింటాఫ్‌ కుమారుడు రాకీ ఫ్లింటాఫ్ సెంచరీతో మెరిశాడు. తద్వారా ఫ్లింటాఫ్‌ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లండ్‌ అండర్‌-19 క్రికెట్‌ చరిత్రలో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా రాకీ ఫ్లింటాఫ్ రికార్డులకెక్కాడు.

ఫ్లింటాప్ కేవలం 16 ఏళ్ల వయస్సులోనే ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 181 బంతులు ఎదుర్కొన్న రాకీ.. 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 106 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫ్లింటాఫ్‌ తన అద్బుత సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 477 పరుగుల భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 

అతడితో పాటు కెప్టెన్ హాంజా షేక్‌(107) సెంచరీతో రాణించాడు. అంతకుముందు శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక బ్యాటర్లలో వీరసింఘే(77) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో నవ్య శర్మ 5 వికెట్లు పడగొట్టగా.. హ్యారీ మోర్, బర్నాడ్ తలా రెండు వికెట్లు సాధించారు. 

ఇక మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు 324 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన లంక మూడో రోజు లంచ్ విరామానికి 7 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది.
 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)